రేవంత్ రెడ్డి అరెస్టును కాంగ్రెస్ నేతలు ఖండించారు. అక్రమంగా అరెస్ట్ చేయడం తెరాస పాశవిక పాలనకు నిదర్శమని మండిపడ్డారు. కేటీఆర్ 111 జీవో పరిధిలో లక్ష అడుగుల రాజ భవనాన్ని నిర్మించారో లేదో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ ఆర్సీ కుంతియా డిమాండ్ చేశారు.
నిబంధనలకు అనుకూలంగా ఉందా లేదా అన్నది ప్రకటించి నిజాయతీ నిరూపించుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేస్తోన్న పోరాటానికి పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. పాలకులు చేస్తున్న అవినీతిని ఎంపీ బయటపెడితే కేసులు పెట్టడమేంటని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఈడీ, సీబీఐతో విచారణ జరిపించాలని అన్నారు.
ఇదీ చూడండి : తెలంగాణలో మరో వ్యక్తిలో కరోనా లక్షణాలు