తెరాస సీనియర్ నాయకుడు పార్టీ వ్యవస్థాపకుడు కూకట్‌పల్లికి చెందిన సుదర్శన్‌రావు ఆకస్మిక మృతి పట్ల... కేటీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పార్టీకి సుదర్శన్ రావు.. తొలి నుంచి పనిచేశారని ఆయనతో తనకు వ్యక్తిగతంగా సుమారు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సుదర్శన్‌రావు గుండెపోటుతో మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిబద్దత కలిగిన ఉద్యమకారున్ని పార్టీ కోల్పోయిందన్నారు. సుదర్శన్‌రావు కుటుంబసభ్యులకు వినోద్ కుమార్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి: దొంగ అనుకొని కొట్టాడు.. ప్రాణం తీశాడు