KTR Among Top 30 Social Media Influencers: ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో ఘనత సాధించారు. సామాజిక మాధ్యమాల ద్వారా.. ప్రభావితం చేసే జాబితాలో ఆయన చోటు సంపాదించారు. ప్రపంచ వ్యాప్తంగా మొదటి 30 మంది జాబితాలో కేటీఆర్‌కు స్థానం దక్కింది. భారతదేశం నుంచి ఇద్దరు యువనేతలు మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. అందులో ఒకరు కేటీఆర్ 12వ స్థానం కాగా మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా 23వ స్థానంలో నిలిచారు. 22వ స్థానంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ ఉన్నాయి.
రెండు ఖాతాల్లోనూ మంత్రి కేటీఆర్ అగ్రస్థానం: ఇద్దరిలోనూ మంత్రి కేటీఆర్ ముందంజలో ఉన్నారు. ఐటీ శాఖ మంత్రిగా.. తెలంగాణ ఐటీ పురోభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్.. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. అటు అధికారిక, ఇటు వ్యక్తిగత రెండు ఖాతాల్లోనూ ఆయన అగ్రస్థానంలో నిలిచారు.
-
Top 30 Influencers for the World Economic Forum @GretaThunberg@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennison
— Jim Harris #WEF23 (@JimHarris) January 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
via KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4Q
">Top 30 Influencers for the World Economic Forum @GretaThunberg@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennison
— Jim Harris #WEF23 (@JimHarris) January 16, 2023
via KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4QTop 30 Influencers for the World Economic Forum @GretaThunberg@vanessa_vash@SumakHelena@wef@NazaninBoniadi@Davos@hedera@femalequotient@MarshMcLennan@Zurich@JimHarris@KTRTRS@WHO@Thomas_Binder@AveryDennison
— Jim Harris #WEF23 (@JimHarris) January 16, 2023
via KCORE Analytics#WEF23 #WEF #Davos #socialmedia #smm pic.twitter.com/KB1rfiOr4Q
ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం: మంత్రి కేటీఆర్ సోషల్‌మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉంటారు. ప్రజల సమస్యలు, రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి గురించి స్పందిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ప్రజల నుంచి సలహాలు తీసుకోవడంతో పాటు.. వారి సమస్యలు పరిష్కరించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల వేదికగా ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుంటారు. ట్విటర్ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమంను నిర్వహిస్తున్నారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలే కేటీఆర్‌ను.. ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలో నిలిపింది.
రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా పలువురు వ్యాపార దిగ్గజాలు, సీఈవోలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న సీ ఫర్ ఐఆర్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడ్డానికి ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈరోజు పెప్సికో పాటు.. మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటుకు బ్యాటరీల తయారీలో ఎంతో పేరున్న అలాక్స్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో.. హైదరాబాద్‌లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభించనున్నట్లు అపోలో టైర్స్ లిమిటెడ్ ప్రకటించింది.
ఇవీ చదవండి: దావోస్ వేదికగా... తెలంగాణ పెవిలియన్‌కు పెట్టుబడుల ప్రవాహం
పౌరుడి పాదాలను కడిగిన రాష్ట్రమంత్రి.. రోడ్లు సరిగ్గా లేవని క్షమాపణ