ETV Bharat / state

KTR Invited To Borlaug Dialogue 2023 : మరో అంతర్జాతీయ సదస్సు నుంచి మంత్రి కేటీఆర్​కు ఆహ్వానం.. ప్రపంచానికి 'తెలంగాణ సాగు పాఠాలు' - బోర్లాన్ డైలాగ్​కు సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి

KTR Invited To Borlaug Dialogue 2023 : ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​కు మరో అంతర్జాతీయ అహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితమహుడు నార్మన్​ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్​ ఇంటర్నేషనల్​ సమావేశంలో.. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా సంస్థ ప్రతినిధులు.. కేటీఆర్​ను ఆహ్వానించారు.

KTR on Borlaug Dialogue
KTR Invited to Borlaug International Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 25, 2023, 9:42 AM IST

Updated : Sep 25, 2023, 9:49 AM IST

KTR Invited To Borlaug Dialogue 2023 : ప్రపంచాన్ని ఆకలి కోరల నుంచి రక్షించి నూతన వంగడాల రూపకల్పనలో పరిశోధనలు చేసిన.. ప్రపంచ హరితవిప్లవ పితామహుడు నార్మన్‌ బోర్లాగ్‌ పేరు మీదుగా నిర్వహిస్తున్న"బోర్లాగ్‌ ఇంటర్నేషనల్‌" సమావేశానికి రావాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రసంగించాల్సిందిగా.. ఈ ఆహ్వాన పత్రంలో పేర్కొన్నారు. రాష్ట్ర అనుభవాలను చర్చించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా బోర్లాగ్​ ఇంటర్నేషనల్​ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని.. మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వాన పత్రంలో ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌’ అధ్యక్షుడు టెర్రీ బ్రాన్‌స్టాడ్‌ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయరంగ అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను సమావేశంలో ప్రసంగించాలని కోరారు.

Borlaug International Dialogue 2023 : అక్టోబరు 24 నుంచి 26 వరకు అమెరికాలోని అయొవా రాష్ట్రంలోని.. డెమోయిన్‌ నగరంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సంవత్సరం జరగనున్న సమావేశంలో "ట్రాన్స్‌ఫర్మేటివ్‌ సొల్యూషన్స్‌ టు అచీవ్‌ ఎ సస్టెయినబుల్, ఈక్విటబుల్‌ అండ్‌ నర్షింగ్‌ ఫుడ్‌ సిస్టమ్‌"’ అనే ప్రధాన ఇతివృత్తం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ఈ సమావేశానికి ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు నేరుగా హాజరవుతారు. వేల మంది ఆన్‌లైన్‌లో భాగస్వామ్యం అవుతారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యవసాయ రంగానికి, ఆహారభద్రతకు ఎదురయ్యే సవాళ్లపై ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

France invites minister KTR: మంత్రి కేటీఆర్‌కు ఫ్రెంచ్ ప్రభుత్వం ఆహ్వానం

  • ప్రపంచ వేదిక పైన తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం

    తెలంగాణ వ్యవసాయ ప్రగతి ప్రస్థానం పైన ప్రసంగించాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు అందిన ప్రతిష్టాత్మక ఆహ్వానం.

    ఈ సంవత్సరం అమెరికాలో జరగనున్న నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కేటీఆర్ కి ఆహ్వానం. pic.twitter.com/bjVuO2T8if

    — Telugu Scribe (@TeluguScribe) September 24, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Borlaug Dialogue 2023 in America : ఈ అంతర్జాతీయ వేదికపై తెలంగాణ సాధించిన వ్యవసాయ ప్రగతి, రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో చర్చించడం ద్వారా.. ప్రపంచ ఆహార కొరతను అధిగమించడం, ఆహార భద్రత, సరఫరాను పెంచడం, వంటి కీలకమైన అంశాలపై ఒక విస్తృత అవగాహన ఏర్పడుతుందని టెర్రీ బ్రాన్‌స్టాడ్‌ పేర్కొన్నారు. రాబోయే భవిష్యత్​ తరాలకు వ్యవసాయరంగంలో వనరుల సద్వినియోగంపై ఈ సమావేశంలో చర్చా జరగనున్నట్లు తెలిపారు.

KTR on Borlaug Dialogue : మరోవైపు బోర్లాగ్ ఇంటర్నేషనల్​ సమావేశానికి ఆహ్వానించినందుకుగాను మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో పాలన సంస్కరణల వల్ల.. గత పదేళ్లలో రాష్ట్రం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను కొనసాగించిందని. వాటి ఫలాలను ఈ రోజు తెలంగాణ రైతాంగం అందుకుంటోందని పేర్కొన్నారు.

ఆహార భద్రత అంశంలో దేశానికి తెలంగాణ భరోసాగా నిలుస్తూ.. అన్నపూర్ణగా మారిందని తెలిపారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ మోడల్​ను.. బోర్లాగ్ అంతర్జాతీయ వేదికపై వివరించడానికి అందిన ఆహ్వానం.. తెలంగాణ ప్రభుత్వ విధానాలకు దక్కిన గౌరవం’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి కూడా సంస్థ ఆహ్వానం పలికింది.

ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సమావేశానికి కేటీఆర్‌కు ఆహ్వానం

Agriculture Minister Singireddy Niranjan Reddy Visit to America : అమెరికాలోని అత్యంత అధునాతన వ్యవసాయ క్షేత్రం 'లాంగ్ వ్యూ ఫార్మ్'​ను సందర్శించిన మంత్రి నిరంజన్​రెడ్డి

Last Updated : Sep 25, 2023, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.