జాతీయ పార్టీలతోనే అభివృద్ధి సాధ్యమన్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, భాజపాలు ఏం సాధించాయని ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లవుతున్నా... వేలాది గ్రామాలకు మంచినీరు, విద్యుత్, రోడ్లు లేవనిమండిపడ్డారు. వారు 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కేసీఆర్ ఐదేళ్లలో ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 40 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుందని గుర్తు చేశారు. హస్తం పార్టీ పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ అయితే తెరాస చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అని వెల్లడించారు.
కాంగ్రెస్.. పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ : కేటీఆర్ - MP ELECTIONS
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసే వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు.