ETV Bharat / state

KTR Fires on Congress : 'రాహుల్, రేవంత్​ లాంటి వాళ్లుంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో..?'

KTR Fires on Congress 2023 : మంత్రి కేటీఆర్ కాంగ్రెస్​పై విమర్శలు గుప్పించారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారని తెలిపారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదమని ట్వీట్​లో ఎద్దేవా చేశారు.

KTR
KTR
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 20, 2023, 11:01 AM IST

Updated : Oct 20, 2023, 11:54 AM IST

KTR Fires on Congress 2023 : రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ నేతలే ఈడీకి ఫిర్యాదు చేశారని మంత్రి కేటీఆర్ ( KTR ) అన్నారు. టికెట్లు అమ్ముకున్నారని ఆ పార్టీ నాయకులే ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డి ఇప్పటికే పట్టుబడ్డారని గుర్తు చేశారు. అవినీతి గురించి రాహుల్‌ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

  • According to Telangana’s Congress MP Venkat Reddy;

    One All India Congressman sells the TPCC post while another Buys it for ₹50 Crore

    And Rahul Gandhi lectures the world on Corruption 🤔

    Scamgress lives up to its Name pic.twitter.com/IQA3yzvPox

    — KTR (@KTRBRS) October 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్ అవసరం లేదని గాంధీజీ అన్నారని.. ఇలాంటివారు హస్తం పార్టీలో ఉంటారని గాంధీజీ ఆనాడే ఊహించారేమో? అని ఎక్స్ ( ట్విటర్) వేదికగా కేటీఆర్ విమర్శించారు. పీసీసీ పోస్టును రూ.50 కోట్లకు అమ్మారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకరు పీసీసీ పోస్టును విక్రయిస్తే మరొకరు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇంత అవినీతి పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ (Rahul Gandhi) అక్రమాలపై మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన వ్యంగాస్త్రాలు సంధించారు.

BRS Leaders Comments on Rahul Gandhi : తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై.. బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అనగానే దిల్లీ నుంచి వస్తున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణకు బంధువులు కాదని, ప్రజలను పీడించే రాబంధులని.. మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. రాష్ట్రంపై ఆయన అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్​రెడ్డి బ్యాచ్ రాసిచ్చే అబద్ధాలనే చదివిపోతున్నారని ఆరోపించారు. రాహుల్ లీడర్ కాదని.. జస్ట్ రీడర్ అని హరీశ్​రావు ఎద్దేవాచేశారు.

KTR Reacts on Adilabad Amit Shah Speech : 'అమిత్ షా, మోదీ ఎన్ని అబద్ధాలాడినా బీజేపీకి తిరస్కారం తప్పదు'

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామ‌ని.. ఏ హోదాతో రాహుల్ గాంధీ చెబుతున్నారని హరీశ్​రావు (Harish Rao) ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖ‌ర్గేనా? రాహులా? ప్రియాంక‌నా? అని అడిగారు. బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీం అని.. రాహుల్ చెప్పడంపైనా ఆయన మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ నాణానికి బొమ్మాబొరుసని ఆరోపించారు. రెండుపార్టీలు తెలంగాణ ద్రోహులేనని మండిపడ్డారు. భారత్ రాష్ట్ర సమితి ఎవరికీ బీ టీమ్​ కాదని.. ప్రజలకు ఏ టీమ్‌ అని పేర్కొన్నారు. ప్రజలే హైకమాండ్ అని హరీశ్‌రావు స్పష్టంచేశారు.

MLC Kavitha Fires on Rahul Gandhi : 'రాహుల్ ఇక్కడికి వచ్చి మీరు చేసేదేం లేదు.. అంకాపూర్ చికెన్ తినేసి వెళ్లండి'

వారి తెలంగాణ.. వీరి తెలంగాణ అంటూ.. రాష్ట్రాన్ని విడగొట్టేలా మాట్లాడారంటూ రాహుల్‌ గాంధీని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అంధకారం రాజ్యమేలుతుందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోని అభివృద్ధి రాహుల్‌ గాంధీకి ఎందుకు కనిపించటం లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గణాంకాలు సేకరించి ఆయన మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు.

ఇన్నేళ్లూ దేశాన్ని కాంగ్రెస్ లేదా బీజేపీ మాత్రమే పాలించాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్న హస్తం పార్టీ దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ చెప్పినట్లే.. కాంగ్రెస్‌ నడుచుకుంటోందన్న ఆయన.. కేంద్రంలో బీసీ సంక్షేమశాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని? అని శ్రీనివాస్​గౌడ్ ప్రశ్నించారు.

Minister KTR Chit Chat : 'డబ్బులు ఇచ్చిన వారికే కాంగ్రెస్‌లో టికెట్లు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత గాంధీభవన్​లో తన్నులాటే'

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

Last Updated : Oct 20, 2023, 11:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.