ETV Bharat / state

టెక్స్‌టైల్స్‌, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలి: కేటీఆర్‌

ktr fire on central government: తెలంగాణ టెక్స్​టైల్ రంగానికి కేంద్ర బడ్జెట్​లో ఈ సారైనా భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. గడచిన ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి ఎలాంటి సహకారం లేదన్న ఆయన.. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, సిరిసిల్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్ తదితరాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. టెక్స్ టైల్, చేనేత రంగం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయి చివరి బడ్జెట్​లోనైనా పెద్దమొత్తంలో నిధులు కేటాయించి నేతన్నల పట్ల మోదీ ప్రభుత్వం తమ చిత్తశుద్ధి చాటుకోవాలని సూచించారు.

KTR
కేటీఆర్
author img

By

Published : Dec 28, 2022, 6:45 PM IST

Updated : Dec 28, 2022, 8:40 PM IST

ktr fire on central government: రాష్ట్రంలోని నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రానున్న కేంద్ర బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్ కోరారు. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టిందన్న ఆయన.. గత ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి ప్రత్యేకంగా అందిన ప్రోత్సాహమేదీ లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి చివరి బడ్జెట్ ఇదేనన్న కేటీఆర్.. ఈ బడ్జెట్లోనైనా భారీగా నిధులు కేటాయించి నేతన్నలు, టెక్స్ టైల్ రంగం పట్ల మోదీ సర్కార్ తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. రానున్న బడ్జెట్​లో నైనా టెక్స్​టైల్ రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలకు తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ప్రతిసారి కేంద్ర ఆర్థిక మంత్రులు మారుతున్నారు కానీ, కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర టెక్స్​టైల్ రంగానికి దక్కుతున్నది శూన్యమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్క్​లో జాతీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్ధలు సైతం పెట్టుబడి పెడుతున్నాయని... దేశీయ టెక్స్​టైల్ రంగంలో ఈ పార్కుకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మెగా టెక్స్​టైల్ పార్క్ మౌలిక వసతుల కల్పన కోసం అనేకసార్లు అభ్యర్థించినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేయకపోవడం వలన పాలసీ ప్రోత్సాహకాలు లేకపోవడంతో పక్కనున్న బంగ్లాదేశ్, శ్రీలంక వంటి చిన్న దేశాల కన్నా టెక్స్​టైల్ రంగంలో ఇండియా వెనుకబడిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా గుర్తుంచుకోవాలని సూచించారు.

చిన్న దేశాలతో పోటీపడేందుకు కూడా కేంద్రానికి ఎనిమిదేళ్ల కాలం సరిపోలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఐదేళ్ల కిందటే ఒక రాష్ట్రంగా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాలతో పోటీపడేలా భారీ మౌలిక వసతుల కల్పన చేపట్టి కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్కును తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ ఎనిమిదేళ్లలో ఇలాంటి ఒక భారీ ప్రయత్నాన్ని కేంద్ర ప్రభుత్వం చేయకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. మౌలిక వస్తువుల కల్పన, విధానపర ప్రోత్సాహకాలు లేకుంటే కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మేకిన్ ఇండియా ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. టెక్స్​టైల్ రంగంలోని అంతర్జాతీయ సంస్థలను దేశానికి రప్పించడంలో మోదీ సర్కార్ పూర్తిగా విఫలమైందని మంత్రి ఆక్షేపించారు.

సిరిసిల్లలో భారీ పవర్ లూమ్ క్లస్టర్​లో 25 వేలకు పైగా పవర్ లూమ్ మగ్గాలు ఉన్నాయని... బడ్జెట్లో దీన్ని మెగా పవర్ లూమ్ క్లస్టర్​గా గుర్తించి కనీసం 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులు అందించాలని కోరారు. సిరిసిల్ల మరమగ్గాల ఆధునికీకరణ, వాల్యూ చైన్ బలోపేతం, మార్కెట్ అభివృద్ధి, నైపుణ్య అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, ప్రాజెక్ట్ మానిటరింగ్ వంటి ఖర్చుల కోసం సుమారు 990 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని... అందులో సింహభాగాన్ని కేంద్ర బడ్జెట్​లో కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇన్ సిట్యూ పవర్ లూమ్ అప్​గ్రేడేషన్ కింద మరో 13 వేల మర మగ్గాల అధునీకీకరణకు నిధులు కేటాయించాలని కోరారు. యాదాద్రి భువనగిరి, గద్వాల, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ తదితర జిల్లాల్లో సుమారు 40వేల చేనేత కార్మికులు పనిచేస్తున్నారని... ఆ అంశాన్ని దృష్టిలో ఉంచుకొనని రాష్ట్రానికి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ సంస్థ మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

చేనేత కళపై డిప్లొమా చేసేందుకు ఇక్కడ అవకాశం లేక ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారన్న మంత్రి... తెలంగాణకు విద్యాసంస్థ మంజూరు చేస్తే విద్యార్థులకు, ఇక్కడి చేనేత పరిశ్రమ అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందుకోసం గుండ్ల పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాలో అవసరమైన స్థలం అందుబాటులో ఉందని అన్నారు. నేషనల్ టెక్స్​టైల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, హ్యండ్​లూమ్ ఎక్స్​పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఏర్పాటు అంశాలను బడ్జెట్​లో ప్రకటించాలని కోరారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్ ద్వారా బ్లాక్ లెవెల్ హ్యాండ్లూమ్ క్లస్టర్లలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

అనేక వినూత్నమైన కార్యక్రమాలతో పాటు మౌలిక వసతుల కల్పన ద్వారా తనదైన ముద్ర వేసుకుంటున్న ప్రగతిశీల రాష్ట్రం తెలంగాణకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని.. అయితే గత బడ్జెట్ కేటాయింపులు చూస్తే టెక్స్​టైల్ రంగాన్ని కాపాడుకుంటున్న తెలంగాణ లాంటి రాష్ట్రాల పట్ల ప్రగతి నిరోధకుల పాత్రను కేంద్రం పోషిస్తోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఈ బడ్జెట్​లో నైనా తెలంగాణ టెక్స్​టైల్ రంగానికి భారీగా నిధులు కేటాయించాలని... లేదంటే దేశంలోని నేతన్నలు, టెక్స్​టైల్ రంగం పట్ల తమకున్న చిన్న చూపును కేంద్రం చాటుకున్నట్లు అవుతుందని వ్యాఖ్యానించారు. గత ఏడేళ్లుగా మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న చేనేత, టెక్స్​టైల్ వ్యతిరేక విధానాలను పున:సమీక్షించుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. నేత కార్మికులకు రద్దు చేసిన పొదుపు పథకాన్ని తిరిగి ప్రారంభించాలని... మోదీ ప్రభుత్వం రద్దు చేసిన ఆల్ ఇండియా హ్యాండ్లూమ్, పవర్ లూం, హాండీ క్రాప్ట్ బోర్డులను తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు.

వర్క్ కం ఓనర్ షెడ్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించి నేతన్నలు తమ కాళ్లపై తాము నిలబడేలా కేంద్రం సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో యార్న్ సబ్సిడీని కనీసం 50 శాతానికి పెంచడంతో పాటు మార్కెటింగ్ ఆధారిత ఇన్సెంటీవ్ పథకాన్ని సరళతరం చేసి నేతన్నలకు అండగా నిలిచేలా బడ్జెట్ లో నిర్ణయాలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. బీమా యోజన పథకాన్ని తిరిగి ప్రారంభించాలని కోరారు. సానుకూల నిర్ణయాలను తీసుకొని మోదీ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకునే చివరి అవకాశం ఈ బడ్డెట్ అన్న కేటీఆర్... భారీగా నిధులు కేటాయించి చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నేతన్నలకు అండగా నిలవాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. చేనేతలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని కోరిన కేటీఆర్.. బడ్జెట్ లో పన్ను మినహాయింపును ప్రకటించాలని కోరారు.

చేనేతను కేవలం ఒక పరిశ్రమగా కాకుండా దేశ సంస్కృతి, సాంప్రదాయయంగా చూడాల్సిన అవసరం ఉందన్న ఆయన.. గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు చేనేత రంగానికి పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. టెక్స్ టైల్, చేనేత రంగానికి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాలని.. ఈ దిశగా పరిశ్రమ వర్గాలు, నేతన్నలతో వేంటనే సంప్రదింపులు జరపాలని కేంద్రానికి మంత్రి సూచించారు. చేనేత సూక్ష్మ, మధ్యతరహా యూనిట్లు మనగడ సాగించేలా ఉదారంగా వ్యవహరించి, పరిశ్రమ ప్రొత్సాహాక చర్యలు ప్రకటించాలని కోరారు. ప్రస్తుతం ఉన్న 20 లక్షల జీఎస్టీ స్లాబ్​ను చేనేత, పవర్ లూమ్ కార్మికులకు 50 లక్షల వరకు పెంచాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన కార్పొరేట్ టాక్స్ తగ్గింపు తరహా మరిన్ని సంస్కరణలు టెక్స్ టైల్ పరిశ్రమలో తీసుకొస్తే విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని... ఆ దిశగా ఆలోచించాలని కేంద్రానికి కేటీఆర్ సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 28, 2022, 8:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.