ETV Bharat / state

KTR Birthday Celebrations in Telangana : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు - ktr birthday celebrations in warangal

KTR Birthday Celebrations : బీఆర్​ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు.. తమ అభిమాన నేతకు వినూత్నరీతుల్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పిలుపు మేరకు ఎక్కడిక్కకడ సేవా కార్యక్రమాలు నిర్వహించిన గులాబీ శ్రేణులు.. కేటీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. యువనేత నడవడిక, నాయకత్వ పటిమ నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కొనియాడారు.

KTR Birthday Celebrations in Telangana
KTR Birthday Celebrations in Telangana
author img

By

Published : Jul 24, 2023, 8:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

KTR Birthday Celebrations in BRS leaders : కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సైక్లింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీలను పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో తలసాని సాయికిరణ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మంత్రులు మహమూద్ అలీ, తలసాని హాజరయ్యారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తలసేమియా వ్యాధిగ్రస్థుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. మంచి నడవడిక, సమర్థ నాయకత్వంతో మంత్రి కేటీఆర్ నేటి తరం ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచారని మంత్రులు పేర్కొన్నారు.

BRS Leaders special wishes to KTR : అమీర్‌పేట్ సారథి స్టూడియోలో మొక్క నాటిన నటుడు అలీ.. కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ నేతృత్వంలో 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్​ఎస్​ కార్యకర్తలకు ద్విచక్రవాహనాలు పంపిణీ చేశారు. ముషీరాబాద్‌లో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పార్సిగుట్టలో టమాటాలు పంపిణీ చేశారు. బాగ్‌అంబర్‌పేట్ బీఆర్​ఎస్​ నాయకురాలు పద్మావతిరెడ్డి నేతృత్వంలో ఒంటరి మహిళలకు కుట్టుమిషన్లు, శానిటేషన్‌ సిబ్బందికి హాట్‌ బాక్సులు పంపిణీ చేశారు. మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు పాస్‌లు అందజేశారు. బాలానగర్ కార్పొరేటర్‌ ఆవుల రవీందర్‌రెడ్డి.. స్థానిక మహిళలకు, జీహెచ్ఎంసీ సిబ్బందికి టమాటాలు పంపిణీ చేశారు. కంటోన్మెంట్‌లో స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నాగేశ్‌ నేతృత్వంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఓల్డ్ బోయిన్‌పల్లిలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వృద్ధులకు వీల్‌ఛైర్‌లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

సేవా కార్యక్రమాలు చేసిన నాయకులు : కేటీఆర్​ పుట్టినరోజు సందర్భంగా మేడ్చల్‌లో నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన సేవా కార్యక్రమాలు కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంత్రి సత్యవతి రాఠోడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య నేతృత్వంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా బీఆర్​ఎస్​ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఖమ్మం జిల్లా మధిరలో జెడ్పీ ఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ నేతృత్వంలో భారీ వాహన ప్రదర్శన నిర్వహించి, అనాథాశ్రమంలో అన్నదానం చేశారు.

Happy Birthday KTR : కేటీఆర్​కు వెరైటీగా బర్త్ డే విషెస్.. డ్రోన్ విజువల్స్ అదిరిపోయాయి..!

కేటీఆర్​కి వినూత్న శుభాకాంక్షలు : కరీంనగర్‌లో మేయర్‌ సునీల్‌రావు నేతృత్వంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్‌.. మున్సిపల్‌ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్వరరావు నేతృత్వంలో సిరిసిల్ల జిల్లా గూడురు గ్రామస్థులకు గొడుగులు పంపిణీ చేసి.. వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. మెదక్‌ జిల్లా కొచ్చెరువుతాండ సర్పంచ్ తారాబాయి.. వ్యవసాయ పొలంలో వరినారుతో కేటీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. నాగర్ కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికు చెందిన ఎంజేఆర్​ ట్రస్ట్ ఆధ్వర్యంలో యువతీయువకులకు ఉచితంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండలో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్‌లు కేకులు కోసి, వేడుకలు నిర్వహించారు.

టమాటాలు పంపిణీ చేసిన బీజేపీ శ్రేణులు : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో బీఆర్​ఎస్​ నేత మన్నెం రంజిత్‌.. వినూత్నంగా కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభిమానాన్ని చాటుకున్నారు. యూకేలోని నాట్టింగమ్ సిటీలో ఉద్యోగం చేస్తున్న రంజిత్.. జెట్‌ విమానంతో కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వరంగల్‌లో బీఆర్​ఎస్​ నేత రాజనాల శ్రీహరి నేతృత్వంలో మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. భూపాలపల్లిలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.