KTR at Hyderabad Steel Bridge Opening : హైదరాబాద్‌లో మరో మణిహారం అందుబాటులోకి వచ్చింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన ఉక్కు వంతెనను మంత్రి కేటీఆర్(KTR) లాంఛనంగా ప్రారంభించారు. 450 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్.. మిగితా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా పూర్తిగా ఉక్కుతో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు.
Nayani Steel Bridge in Hyderabad : స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను(CM KCR) హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి అని ప్రజలను కోరారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని విజ్ఞప్తి చేశారు. 2023లో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించి ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే కులాలకు , మతాలకు అతీతంగా ఉండాలన్నారు. గతంలో నగరంలో కర్ఫ్యూలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవని చెప్పారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందన్నారు.
-
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) లో భాగంగా నిర్మించిన మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇందిరా పార్కు నుండి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ను పురపాలక శాఖ మంత్రి @KTRBRS నేడు… pic.twitter.com/tVWhi1zj7u
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) లో భాగంగా నిర్మించిన మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇందిరా పార్కు నుండి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ను పురపాలక శాఖ మంత్రి @KTRBRS నేడు… pic.twitter.com/tVWhi1zj7u
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2023వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) లో భాగంగా నిర్మించిన మరో ఫ్లై ఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. ఇందిరా పార్కు నుండి వీఎస్టీ మధ్య వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఉక్కుతో నిర్మించిన 2.6 కిలో మీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ను పురపాలక శాఖ మంత్రి @KTRBRS నేడు… pic.twitter.com/tVWhi1zj7u
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) August 19, 2023
Hyderabad Steel Bridge Features : భాగ్యనగర సిగలో మరో మణిహారం.. స్టీల్ బ్రిడ్జి ప్రత్యేకతలు ఇవే..?
"తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌లో 36వ ఫ్లై ఓవర్ ఇది. ఇందిరాపార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత మాది. నాయిని నర్సింహారెడ్డి రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని కేసీఆర్ ఆదేశించారు. లోయర్ ట్యాంక్ బండ్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తాం. విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడింది. మతాల మధ్య చిచ్చుపెట్టి కొందరు పబ్బం గడుపుతున్నారు. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలి." అని కేటీఆర్ అన్నారు.
"సిగ్నల్ ఫ్రీ హైదరాబాద్ కోసం.. రాష్ట్రప్రభుత్వం ఎస్‌ఆర్‌డీపీ కార్యక్రమం ప్రారంభించి పెద్దమొత్తంలో రహదారుల విస్తరణ చేపడుతోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చేందుకు బీఆర్‌ఎస్ కృషి చేస్తోంది. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి. ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి." - కేటీఆర్, పురపాలక మంత్రి
Nayani Narasimha Reddy Steel Bridge Hyderabad : రాష్ట్రంలోనే తొలిసారిగా మెట్రోబ్రిడ్జిపై నుంచి ఈ పైవంతెన(Hyderabad Steel Bridge)ని ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జి ద్వారా గ్రేటర్‌లో సిగ్నల్ ఫ్రీ రవాణా మెరుగుపడటమే కాకుండా సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంది. ఈ వంతెన అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇందిరాపార్క్ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వరకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఉస్మానియావర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లే.. ప్రయాణికుల సమయం తగ్గనుంది. ఇందిరాపార్క్, అశోక్‌నగర్ వద్ద వాహనాల రద్దీ లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ వరకు రాకపోకలకు మార్గం సుగమం కానుంది. ఆ స్టీల్ బ్రిడ్జికి తొలి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేరుపెట్టారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్‌టీ వరకు రెండున్నర కిలోమీటర్ల పొడవున.. 81 పిల్లర్లపై నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లైవంతెన అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తీరనున్నాయని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
KTR Rajanna Sircilla District Tour : 'కోనసీమను తలదన్నేలా సిరిసిల్ల అభివృద్ధి చెందింది'