ETV Bharat / state

ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.. కేటీఆర్​, బండి సంజయ్​ ట్వీట్​ల వార్​ - బీజేపీని విమర్శిస్తూ కేటీఆర్​ ట్వీట్​

KTR AND BANDI SANJAY TWEET WAR: ఉగాది పండగ వేళ మంత్రి కేటీఆర్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ సోషల్​ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుకున్నారు. బీజేపీను విమర్శిస్తూ కేటీఆర్​ ట్వీట్​ చేస్తే.. బీఆర్​ఎస్​ను విమర్శిస్తూ బండి సంజయ్​ ట్విటర్​ వేదికగా విమర్శలు చేసుకున్నారు. పంచాగం ఎలా చెబుతారో అలానే ఆ ట్వీట్​ చేశారు.

ktr bandi sanjay
ktr bandi sanjay
author img

By

Published : Mar 22, 2023, 10:49 PM IST

KTR AND BANDI SANJAY TWEET WAR: రాష్ట్రంలో బీఆర్​ఎస్​, బీజేపీ నువ్వానేనా అన్నట్లు ఇంటా.. బయటా బహిరంగంగానే మాటల యుద్ధానికి దిగుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు బహిరంగంగానే కాకుండా సోషల్​ మీడియాలో సైతం అదే రకంగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఎర కేసు గురించి బీఆర్​ఎస్​.. బీజేపీపై ధ్వజమెత్తితే.. దిల్లీ లిక్కర్​ స్కాం కేసులో బీజేపీ.. బీఆర్​ఎస్​పై విమర్శనాస్త్రాలు సంధించింది. ఇప్పుడు తాజాగా టీఎస్​పీఎస్సీ కేసులో విపక్షాలు అన్నీ ఏకమై రాష్ట్ర ప్రభుత్వంపై దాడి చేసే పరిస్థితికి వచ్చింది.

అయితే తాజాగా ఉగాది రోజున అందరూ పండగ చేసుకుంటే మాత్రం మంత్రి కేటీఆర్​, ఎంపీ బండి సంజయ్​ మాత్రం ట్వీట్​లతో వార్​ కొనసాగించారు. ముందుగా మంత్రి కేటీఆర్​ వినూత్నంగా ట్వీట్​ చేశారు. ఈరోజు పంచాంగం అనేది ప్రత్యేకమైనందున ఆ రీతిలోనే ట్విటర్​ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదాయం అదానీకి.. వ్యయం ఏమో జనానికి, బ్యాంకులకు అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్​ చేశారు. ఇంకా అవమానం నెహ్రూకి.. రాజపూజ్యం ఏంటా అంటే గుజరాతీ గుంపులకీ అన్నట్లు ట్వీట్​ను కొనసాగించారు. మళ్లీ బస్​, బభ్రాజీమానం భజగోవిందం!, దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం! అంటూ ముగింపు నిచ్చారు.

ఆ తర్వాత కేటీఆర్​ ట్వీట్​కు సమాధానంగా బండి సంజయ్​ సైతం ఘాటుగానే ట్వీట్​ చేశారు. ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి.. వ్యయం తెలంగాణ రాష్ట్రానికి అంటూ విమర్శిస్తూ రీట్వీట్​ చేశారు. అయితే అవమానం ఉద్యమ వీరులకు, అమర వీరుల త్యాగాలకు అంటూ.. మరి రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కేటీఆర్​ ట్వీట్​కు కౌంటర్​ ఇచ్చారు. తుస్​.. పిట్టల దొర, తుపాకీ చంద్రుల గడీల పంచాయతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే అంటూ బీఆర్​ఎస్​, సీఎం కేసీఆర్​ను ఉద్దేశిస్తూ ట్వీట్​ ద్వారా హెచ్చరించారు.

"ఆదాయం: అదానీకి, వ్యయం: జనానికి, బ్యాంకులకు.. అవమానం: నెహ్రూకి, రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి.. బస్, బభ్రాజీమానం భజగోవిందం! దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!" - మంత్రి కేటీఆర్​ ట్వీట్​

  • As forwarded 👇😁

    ఆదాయం: అదానీకి!
    వ్యయం: జనానికి, బ్యాంకులకు!

    అవమానం: నెహ్రూకి!
    రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!!

    బస్, బభ్రాజీమానం భజగోవిందం!
    దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!

    — KTR (@KTRBRS) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి.. అవమానం ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు, రాజపూజ్యం ఉద్యమ ద్రోహులకు, దొంగలకు.. తుస్.. పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే." - బండి సంజయ్​ ట్వీట్​

  • As forwarded 👇

    ఆదాయం : కల్వకుంట్ల కుటుంబానికి
    వ్యయం : తెలంగాణ రాష్ట్రానికి

    అవమానం : ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు
    రాజపూజ్యం : ఉద్యమ ద్రోహులకు, దొంగలకు !!

    తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి...పతనం ఇగ షురువాయే.

    — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.