ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా పనిచేస్తున్నారని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.హైదరాబాద్లోని అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో జరిగిన 'కీ మేకర్స్ యూత్ సదస్సు'లో పాల్గొన్నారు. భారత్ ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అనితెలిపారు. యువత తమ శక్తిని ఉపయోగించుకునేందుకు ఇదే సరైన సమయమన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని పేర్కొన్నారు. సామాన్య మానవునికి ఉపయోగపడని టెక్నాలజీ వృథా అని సీఎం కేసీఆర్ చెపుతుంటారని గుర్తు చేశారు. నిత్యం ఎదుర్కొనే సమస్యల నుంచే నూతన ఆవిష్కరణలు వస్తాయని తెలిపారు. 'టాస్క్' ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పెంచేందుకు కృషి చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి టీ హబ్నిఏర్పాటు చేశామని తెలిపారు.
ఇవీ చూడండి:5 గంటలకు ఎన్నికల షెడ్యూల్