హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా నదీ బోర్డు ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన మ.12 గం.కు బోర్డు సమావేశం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఫిర్యాదుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు, నీటి కేటాయింపులు, టెలిమెట్రీ సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని... కృష్ణా, గోదావరి బేసిన్‌లో కొత్తగా ప్రాజెక్టులు చేపట్టలేదని పేర్కొంటూ కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ముందే వివరించింది.
పోతిరెడ్డిపాడు కాల్వ సామర్థ్యాన్ని పెంచాలన్న ఏపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీనికి ప్రతిగా పాలమూరు-రంగారెడ్డి, డిండి, ఇత ప్రాజెక్టుల సామర్థ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచిందని ఏపీ సర్కార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేని ప్రాజెక్టులు నిలిపివేయాలని రాష్ట్రానికి జల్‌శక్తి శాఖ సూచనలు చేసింది.
ఇదీ చూడండి: 'మార్కెట్లో అమ్ముడుపోయే పంటలే పండించాలి'