ETV Bharat / state

తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లతో ఈ నెల 24న కృష్ణా బోర్డు సమావేశం - అక్టోబర్​ 24న కృష్ణా బోర్డు సమావేశం హైదరాబాద్

రెండు తెలుగు రాష్ట్రాలు 2019-20 సంవత్సరంలో వినియోగించిన నీటి లెక్కలు తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్టు కసరత్తు చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల ఇంజినీర్లతో కృష్ణా నదీయాజమాన్య బోర్డు అక్టోబర్​ 24న సమావేశం నిర్వహించనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్​ మీనా లేఖ రాశారు. గత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటికి సంబంధించిన వివరాలను పరిశీలించి సరిచేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల ఇంజినీర్లతో ఈ నెల 24న కృష్ణా బోర్డు సమావేశం

author img

By

Published : Oct 13, 2020, 9:45 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2019-20 సంవత్సరంలో వినియోగించిన జలాల లెక్కలు తేల్చేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా బోర్డు ఎస్ఈ ఈ నెల 24న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. గత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటికి సంబంధించిన వివరాలను పరిశీలించి సరిచేయనున్నారు.

శ్రీశైలానికి సంబంధించి 807, నాగార్జునసాగర్​కు సంబంధించి 510 అడుగుల మట్టాన్ని పరిగణలోకి తీసుకొని వివరాలు ఖరారు చేయాలని తెలంగాణ ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేసింది. ఆ లేఖను ఏపీకి పంపిన బోర్డు.. తెలంగాణ అభిప్రాయాన్ని తెలిపింది. అటు కృష్ణా డెల్టా, కల్వకుర్తి ఎత్తిపోతల, కేసీ కెనాల్​కు సంబంధించిన వివరాలు 2019 డిసెంబర్ నుంచి సరిచేయాల్సి ఉందని, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, సరిహద్దు వద్ద సాగర్ ఎడమ కాల్వ వివరాలను 2019 ఏప్రిల్ నుంచి సరిచేయాల్సి ఉందని బోర్డు పేర్కొంది.

వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఇరు రాష్ట్రాల ఇంజినీర్లతో కృష్ణా నదీయాజమాన్య బోర్డు ఎస్ఈ అక్టోబర్​ 24న సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు బోర్డు సభ్యకార్యదర్శి హరికేశ్​ మీనా లేఖ రాశారు.

ఇదీ చదవండి: కేటాయింపునకు మించి నీటిని వాడుకున్నారు: ఏపీకి కృష్ణా బోర్డు లేఖ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.