ETV Bharat / state

KRMB AND GRMB MEET: జల్‌శక్తి శాఖతో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ - water disputes between telangana and ap

ఇరు రాష్ట్రాల జల వివాదంలో అక్టోబరు 14 నుంచి గెజిట్​ అమలు(GAZETTE IMPLEMENTATION)పై చర్చ జరుగుతోంది. కేంద్ర జల్​శక్తి శాఖ అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి(KRMB- GRMB) బోర్డుల ఛైర్మన్లు దిల్లీలో సమావేశమై గెజిట్​ అమలుపై చర్చించనున్నారు.

KRMB AND GRMB MEET
కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్ల భేటీ
author img

By

Published : Sep 13, 2021, 5:46 PM IST

Updated : Sep 13, 2021, 8:13 PM IST

కేంద్ర జల్‌శక్తి శాఖ(Union Ministry of Water Energy) అదనపు కార్యదర్శితో కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు(KRMB, GRMB CHAIRMEN) భేటీ అయ్యారు. దిల్లీలో జరిగిన ఈ సమావేశంలో కేఆర్​ఎంబీ, జీఆర్​ఎంబీ బోర్డుల ఛైర్మన్లు చంద్రశేఖర్‌ అయ్యర్, ఎంపీ సింగ్ పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి నిర్వహణకు వచ్చే నెల 14 నుంచి గెజిట్‌ అమలు(GAZETTE IMPLEMENTATION)సాధ్యాసాధ్యాలపై అధికారులు చర్చిస్తున్నారు. గెజిట్‌లోని పలు అంశాలపై ఇరు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో గెజిట్‌పై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ జలవివాదం పరిష్కారానికి రెండు బోర్డుల పరిధిలను నిర్ణయిస్తూ కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ జులై 15న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా గెజిట్‌ అమలుపై కేంద్రానికి సీఎం కేసీఆర్(CM KCR)​ ఇటీవల పలు సూచనలు చేశారు.

రాష్ట్రాల అసంతృప్తి

ప్రతి పదం పరిశీలించి మరీ గెజిట్​ నోటిఫికేషన్ తీసుకువచ్చామని జలశక్తి శాఖ చెబుతున్నా.. నోటిఫికేషన్​లో ప్రస్తావించిన చాలా అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతం పరిధిలో ప్రతి ప్రాజెక్టు, కాలువలను నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేవటంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అందుకే భేటీ

గతంలో నోటిఫికేషన్‌ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ(Union Ministry of Water Energy) నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి గెజిట్​ అమలులోకి వస్తుందని పేర్కొంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని, లేకుంటే నిలిపివేయాలని కూడా పేర్కొంది. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. గెజిట్‌లో పేర్కొన్న గడువుల ప్రకారం చేయడం సాధ్యం కాదని, దశలవారీగా అయితే ఇబ్బంది ఉండదని రెండు రాష్ట్రాలూ వివరించాయి. ట్రైబ్యునల్‌.. నీటిని కేటాయించకుండా అనుమతులు ఎలా వస్తాయని తెలంగాణ ప్రశ్నించింది. కాలువలు తెగిపోవడం, డ్యాంల నిర్వహణలో సమస్యలు వస్తే ఎలా చేస్తారని, మీ దగ్గర ఏ యంత్రాంగం ఉందని, ఒక రోడ్‌మ్యాప్‌ ఉండాలని సూచించింది.

రెండో షెడ్యూలులో సరిపోతుంది..

2 నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయడం సాధ్యంకాదని, 15 రోజులకోసారి అప్పటి అవసరం ఎంతో చెప్తే దానికి తగ్గట్లుగా విడుదల చేస్తామని కూడా రాష్ట్రాలు వివరించాయి. ఈ సమావేశం తర్వాత కృష్ణానదిపై(KRMB) ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని, ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి పలుఅంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిలో అన్ని ప్రాజెక్టులను బోర్డు(GRMB) పరిధిలో చేర్చడం, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి అనుమతి లేదని పేర్కొనడం సరికాదన్నారు. వీటన్నిటిపై ఈ నెల పదిన కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా నేడు బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.

కాగా ఈ రోజు గెజిట్(Gazette On KRMB, GRMB) నోటిఫికేషన్ అమలు కార్యాచరణను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. నోటిఫికేషన్ అమలు కోసం బోర్డులకు కేంద్ర జలశక్తిశాఖ ఇంజినీర్లను కేటాయించింది. రెండు బోర్డులకు ఇద్దరు చొప్పున చీఫ్ ఇంజినీర్లను కేటాయించింది. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునే ప్రక్రియలో చీఫ్ ఇంజినీర్లు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: Ganesh immersion: గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ

Last Updated : Sep 13, 2021, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.