కొండ లక్ష్మణ్ బాపూజీ 105వ జయంతి సందర్భంగా హైదరాబాద్ గుడిమల్కాపూర్‌లోని రాజలింగయ్య కబడ్డీ స్టేడియం వద్ద ఆయన చిత్రపటానికి నాంపల్లి భాజపా ఇన్ఛార్జ్ దేవర కరుణాకర్ నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పోరాటం చేసిన మహానేతని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
తన సొంత ఇల్లును కార్యాలయం కోసం దానం చేశారని.. ఆయనో గొప్ప గాంధేయవాది అని, బీద బడుగు బలహీన వర్గాల నేతని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి అశోక్‌యాదవ్, అన్ను యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి