ETV Bharat / state

Komatireddy Venkat reddy: 'వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలి'

Komatireddy Venkat reddy: వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి డిమాండ్​ చేశారు. ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. రాఘవ అరెస్టుకు డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

Komatireddy Venkat reddy: 'వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలి'
Komatireddy Venkat reddy: 'వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలి'
author img

By

Published : Jan 6, 2022, 2:04 PM IST

Updated : Jan 6, 2022, 2:56 PM IST

Komatireddy Venkat reddy: 'వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలి'

Komatireddy Venkat reddy: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డికి మంచి పేరుందని...సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో రాఘవేందర్‌ను అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే కుమారుడి వేధింపులను వివరిస్తూ బాధితుడు సెల్ఫీ వీడియో తీసిన తర్వాత కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాఘవ ఎక్కడున్నాడో గుర్తించలేరా అని కోమటిరెడ్డి మండిపడ్డారు. హోంమంత్రి ఉన్నా లేనట్టేనని.. ఆరోపించిన భువనగిరి ఎంపీనా, సొంత పార్టీనా అని చూడకుండా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు.

రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత తొలిసారి గాంధీభవన్‌కు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వచ్చారు. చౌటుప్పల్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరిశ్రమల కారణంగా చాలా గ్రామాలు ప్రభావితమవుతన్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతమంతా నాశనమవుతుందని తెలిపారు. బోర్ల నుంచి రసాయనాలతో కూడిన నీరు వస్తుండడంతో బతకలేని పరిస్థితులు ఏర్పడ్డాయని ఎంపీ వివరించారు. ఫార్మాసిటీ ఏర్పాటును వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

వెంటనే అరెస్ట్​ చేయాలి..

వనమా రాఘవను ఏ1గా మార్చి వెంటనే అరెస్ట్​ చేయాలి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల కుమారులు ఆత్మహత్యలకు కారణమవుతుంటే... తెలంగాణ పోలీసులు బెస్ట్​ అంటూ ముఖ్యమంత్రి మాట్లాడుతుంటారు. డీజీపీకి ఉత్తమ డీజీపీ అవార్డు కూడా వచ్చింది. ఎమ్మెల్యే కుమారుడిపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. రాఘవ అరెస్టుకు డీజీపీ చర్యలు తీసుకోవాలి. -కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, భువనగిరి ఎంపీ

ఇదీ చదవండి:

Last Updated : Jan 6, 2022, 2:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.