Venkat Reddy comments on Munugode by election campaign: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీరుపై అసంతృప్తితో కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. కోమటిరెడ్డి నివాసంలో దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డిని బుజ్జగించిన ఆయన.. మునుగోడు అభ్యర్థి ఎంపికపై వెంకట్‌రెడ్డి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. అభ్యర్థి ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని ఆయనకు వివరించారు. అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయానికి వెంకట్‌రెడ్డి సహకరిస్తారని స్పష్టం చేశారు.
మునుగోడు అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో చర్చించాం. అభ్యర్థి ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని ఆయనకు వివరించా. అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయానికి వెంకట్‌రెడ్డి సహకరిస్తారు.-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
మరోవైపు భట్టి విక్రమార్కతో భేటీపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. మునుగోడు అభ్యర్థి ఎంపికపై భట్టి తనతో చర్చించారని పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపికపై నిన్న, ఇవాళ పార్టీలో జరిగిన కరసత్తుపై వివరించారన్నారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదన్న వెంకట్‌రెడ్డి.. అభ్యర్థి ఎంపిక విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు. సర్వేల ప్రకారం అభ్యర్థి ఎంపిక ఉంటుందన్న ఆయన.. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి తాను వెళ్తానని స్పష్టం చేశారు.
మునుగోడు అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క చర్చించారు. నిన్న, ఇవాళ అభ్యర్థి ఎంపికపై పార్టీలో జరిగిన కసరత్తుపై తెలిపారు. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ఎంపిక చేసినా అభ్యంతరం లేదు. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుంది. సర్వేల ప్రకారం మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి ఎంపిక ఉంటుంది. నేను మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళ్తా.-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ
పదునైన వ్యూహాలతో ముందుకు..: మునుగోడు ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు.. పదునైన వ్యూహాలతో ముందుకెళ్లాలని అధిష్ఠానం నిర్ణయించింది. గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో మునుగోడు అభ్యర్థి ఎంపికపై బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, నల్గొండ, భువనగిరి రెండు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. రాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కొనసాగింది. జానారెడ్డి, జీవన్‌రెడ్డి జూమ్‌లో హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో భాజపా, తెరాస మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి..
మునుగోడు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోన్న హస్తం
టిక్‌టాక్ స్టార్ మృతి కేసులో ట్విస్ట్, హత్యేనని తేల్చిన పోలీసులు, ఇద్దరు అరెస్ట్