ETV Bharat / state

'మేమంతా కలియుగ మహాభారత టీకాంగ్రెస్​ పాండవులం'

కేసీఆర్ కుటుంబ పాలన నుంచి తెలంగాణ విముక్తి కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్‌ను నియంత అంటున్నట్లు తెలిపారు.

'మేమంతా కలియుగ మహాభారత టీకాంగ్రెస్​ పాండవులం'
author img

By

Published : Sep 16, 2019, 7:30 PM IST

కలియుగ మహాభారతంలో కాంగ్రెస్‌ పదేళ్లు వనవాసం చేస్తోందని మునుగోడు కాంగ్రెస్​ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. అసెంబ్లీ లాబీలో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. భట్టి శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు, జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్‌బాబు ధర్మరాజు, నకుల సహదేవులు సీతక్క, పొదెం వీరయ్యలుగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'రేవంత్​రెడ్డికి పీసీసీ.. సోషల్​మీడియా ప్రచారమే'

TG_Hyd_39_16_Komatireddy_Rajagopalreddy_Chit_Chat_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) కేసీఆర్ కుటుంబపాలన నుంచి తెలంగాణ విముక్తి కావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేసినందుకే కేసీఆర్‌ను నియంత అంటున్నట్లు తెలిపారు. కౌరవులు వంద మంది ఉన్నా పాండవులదే విజయమని పేర్కొన్నారు. ఇప్పుడు కలియుగ మహాభారతంలో కాంగ్రెస్‌కు పదేళ్లు వనవాసమని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. భట్టి శ్రీకృష్ణుడు, కోమటిరెడ్డి అర్జునుడు, జగ్గారెడ్డి భీముడు, శ్రీధర్‌బాబు ధర్మరాజు, నకుల సహదేవులు సీతక్క, పొదెం వీరయ్యలుగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్‌ను గద్దె దించడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.