ETV Bharat / entertainment

అది ఫైనలైజ్ అవ్వగానే 'స్పిరిట్' షూటింగ్​ స్టార్ట్ : నిర్మాత భూషణ్​ కుమార్ - PRABHAS SPIRIT MOVIE

ప్రభాస్ 'స్పిరిట్' షూటింగ్ అప్పుడే - స్పెషల్ అప్​డేట్ రివీల్ చేసిన ప్రొడ్యూసర్

Prabhas Spirit Shooting Update
Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 6, 2024, 1:07 PM IST

Prabhas Spirit Shooting Update : రెబల్ స్టార్ ప్రభాస్‌ లీడ్ రోల్​లో డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా రూపొందిచనున్న లేటెస్ట్ మూవీ 'స్పిరిట్‌'. తాజాగా డైరెక్టర్ ఇచ్చిన స్పెషల్ అప్​డేట్​తో ఈ సినిమాపై బజ్ క్రియేట్​ అవ్వగా, ఇప్పుడు నిర్మాత భూషణ్‌కుమార్‌ కూడా 'స్పిరిట్' గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చారు. బాలీవుడ్ మూవీ 'భూల్‌ భూలయ్యా 3' ప్రమోషన్స్​లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన 'స్పిరిట్‌' షూటింగ్ గురించి మాట్లాడారు.

"మా టీమ్​ అంతా ప్రస్తుతం 'స్పిరిట్‌' పనుల్లోనే బిజీగా ఉన్నాం. అందులో నటించేవారిని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. త్వరలోనే ఆ ప్రాసెస్​ను ప్రారంభించనున్నాం. డిసెంబర్‌ చివరి కల్ల షూటింగ్ మొదలుపెట్టేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఆ తర్వాత ఆరు నెలల గ్యాప్​లోనే సందీప్ 'యానిమల్‌ పార్క్‌'ను స్టార్ట్ చేశారు" అని భూషణ్ కుమార్ చెప్పుకొచ్చారు.

పండుగ రోజు మ్యూజిక్ పనులు
తాజాగా దీపావళి సందర్భంగా 'స్పిరిట్' మ్యూజిక్‌ పనులు మొదలయ్యాయంటూ మూవీ టీమ్​ ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ ఆ వీడియోను ట్విట్టర్​లో షేర్ చేశారు. హర్షవర్ధన్‌, సందీప్‌ ట్యూన్స్‌ ఎంజాయ్‌ చేస్తూ కనిపించిన ఆ గ్లింప్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి గతంలో డైరెక్టర్ సందీప్ కూడా మాట్లాడారు. ఫస్ట్ డే ఈ సినిమా కచ్చితంగా రూ.150కోట్లు వసూళ్లు చేయడం ఖాయమంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 'స్పిరిట్‌'లో హీరో ప్రభాస్‌ డిఫరెంట్​ లుక్స్​లో కనిపిస్తారని అన్నారు. ప్రభాస్​ను గత 24 సినిమాల్లో ప్రేక్షకులు ఒకలా చూశారని, ఇప్పుడు మరో రేంజ్​లో చూస్తారని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్‌లో చాలా స్పెషాలిటీస్​ ఉన్నాయని కొనియాడారు. ఆయన్ను తెరపై చూపించే విధానం ఆడియన్స్‌కు నచ్చితే చాలని, ఈ సినిమా కచ్చితంగా సక్సెస్​ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

పోలీస్​ నుంచి మరో పాత్రకు!
మరోవైపు 'స్పిరిట్' సినిమాలో ప్రభాస్ పోలీస్​గానే కాకుండా మరో విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారట. మొదట్లో పోలీస్​గా ఉన్న ప్రభాస్, స్టోరీలోని ట్విస్ట్​ కారణంగా ఓ గ్యాంగ్​స్టర్​గా అవుతారని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. కానీ అభిమానులు మాత్రం ప్రభాస్ ఆ రోల్​ కూడా బాగా సూట్ అవుతారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభాస్​ 'స్పిరిట్​'లో మరో ఇద్దరు బడా హీరోలు! - ఎవరంటే?

'స్పిరిట్'​ బడ్జెట్​పై లేటెస్ట్​ బజ్​ - ఏకంగా ఎన్ని వందల కోట్లంటే? - Spirit Movie Budget

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.