Metro Google Wallet: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు అదిరే శుభవార్త వచ్చింది. మెట్రో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మరో సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. దీంతో ఇకపై ప్రయాణికులు మరింత సులభంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు 'గూగుల్ వ్యాలెట్' సేవలను మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు.
ప్రయాణికులకు ప్రత్యేకమైన టికెటింగ్ అనుభవాన్ని అందించేందుకు రూట్ మొబైల్ L&T మెట్రో రైల్ హైదరాబాద్.. ముంబయికి చెందిన ఇంటిగ్రేషన్ పార్ట్నర్ బిల్లేసీ ఇ సొల్యూషన్స్ (Billeasy)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంలో రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS), గూగుల్ వ్యాలెట్ సేవలను అందిస్తుంది. ఈ సర్వీస్ మెట్రో టికెటింగ్ ప్రాసెస్‌ను మరింత సులభతరం చేస్తుంది.
ఇకపై ప్రయాణికులు సులభంగా ఇ-టికెట్‌లను బుక్ చేసుకుని వాటిని గూగుల్ వ్యాలెట్‌లో సేవ్ చేసుకునేందుకు ఈ సర్వీస్ వీలు కల్పిస్తుంది. ఇలా ఇది ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, సమర్థవంతమైన ప్రయాణాలను అందిస్తుంది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ సాంకేతికతను ఉపయోగించి ఈ గూగుల్ వ్యాలెట్ సర్వీసులను రూపొందించారు. ఇది ప్రయాణీకులను వారి డిఫాల్ట్ ఆండ్రాయిడ్ మెసేజింగ్ యాప్ గూగుల్ మెసేజెస్ నుంచి నేరుగా టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
దీంతో ప్రయాణికులు ఎక్కువ సేపు క్యూలైన్లలో నిలబడి టికెట్ కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం అదనపు యాప్‌లను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీంతో ఇకపై మెట్రో రైలు హైదరాబాద్ నలుమూలల ఉన్న ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరంగా మారుతుంది.
దీన్ని ఉపయోగించడం ఎలా?:
- ఈ సర్వీసును ఉపయోగించేందుకు ప్రయాణికులు QR కోడ్‌ని స్కాన్ చేసి, గూగుల్ మెసేజ్‌లలో RCS మెసేజింగ్ ద్వారా అధికారిక L&T మెట్రో రైల్ హైదరాబాద్ హ్యాండిల్‌కు 'Hi' అనే మెసేజ్ పంపాలి.
- వారు.. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో టికెట్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకునేందుకు గైడ్ చేస్తారు.
- ఇన్స్టాంట్ కన్ఫర్మెషన్ తర్వాత UPI వంటి పేమెంట్ యాప్స్ ద్వారా పేపెంట్ పూర్తి చేయొచ్చు.
- ఒకసారి బుక్ చేసిన తర్వాత ఆ టికెట్లు గూగుల్ వ్యాలెట్‌లో స్టోర్ అయి ఉంటాయి.
- దీంతో వాటిని ఫోన్ నుంచి నేరుగా యాక్సెస్ చేయొచ్చు.
- ఇందుకోసం ఈ కొత్త యాప్‌ను డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
- ఇది గూగుల్ మెసెజెస్ యాప్‌లో పనిచేస్తుంది.
- అయితే ఈ సర్వీస్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది భవిష్యత్తులో iOSకి సపోర్ట్ చేస్తుంది.
ఎక్స్ యూజర్స్‌కు క్రేజీ అప్డేట్- మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి పోస్ట్‌లను ఇకపై చూడొచ్చు- అదెలాగంటే?
డ్రైవర్ల కొరతను తీర్చేందుకు జపాన్ మాస్టర్ ప్లాన్- ఆటోమేటెడ్ కార్గో ట్రాన్స్‌పోర్ట్‌పై ఫోకస్