ETV Bharat / offbeat

చికెన్​, మటన్​ మాత్రమే కాదు, టమాటలతోనూ "దమ్​ బిర్యానీ" చేసుకోవచ్చు!- టేస్ట్​ సూపర్​గా ఉంటుంది!

-ఎప్పుడూ నాన్​వెజ్​తోనే బిర్యానీ కాదు -ఇలా టమాటాలతో కూడా రెడీ చేయొచ్చు!

Tomato Biryani Recipe
How to Make Tomato Biryani Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Tomato Dum Biryani Recipe : బిర్యానీ అనగానే చాలా మంది భోజన ప్రియులకు నోట్లో నీళ్లూరతాయి. వేడివేడిగా చికెన్, మటన్​ బిర్యానీని రైతాతో తింటే టేస్ట్​ అద్దిరిపోతుంది. అయితే, మాంసాహారంతోనే కాకుండా టమాటలతో కూడా ఘుమఘుమలాడే బిర్యానీ ప్రిపేర్​ చేయవచ్చు. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే ఎంతో రుచికరమైన టమాటా బిర్యానీ మీ ముందుంటుంది. సింపుల్​గా టేస్టీగా టమాటా బిర్యానీ ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • బాస్మతి బియ్యం - 2 కప్పులు
  • టమాటాలు-8 (ప్యూరీ కోసం 4 టమాటాలు, 4 దమ్​ బిర్యానీలోకి కట్​ చేసుకోవాలి)
  • చిన్న అల్లం ముక్కలు -2
  • వెల్లుల్లి రెబ్బలు-10
  • నూనె-2 టేబుల్​స్పూన్లు
  • నెయ్యి-2 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయలు-2
  • కారం -2 టేబుల్​స్పూన్లు
  • ధనియాల పొడి-టీస్పూన్​
  • పసుపు-చిటికెడు
  • జీలకర్ర పొడి - అరటీస్పూన్​
  • గరం మసాలా - అరటీస్పూన్​
  • కొత్తిమీర, పుదీనా తరుగు -కొద్దిగా
  • పెరుగు -2 టేబుల్​స్పూన్లు
  • కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్​

రైస్​ ఉడికించుకోవడానికి.. అలాగే దమ్​ బిర్యానీలోకి మసాలా దినుసులు (రెండు సార్లు ఇలా తీసుకోవాలి)..

  • బిర్యానీ ఆకు
  • చిన్న దాల్చిన చెక్క
  • మిరియాలు -5
  • షాజీరా-టీస్పూన్​
  • లవంగాలు-3
  • యాలకులు-3
  • మరాఠి మొగ్గలు-2
  • కొంచెం జాపత్రి

తయారీ విధానం :

  • ముందుగా బాస్మతి బియ్యాన్ని బాగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి నాలుగు గ్లాసుల నీళ్లు పోసి వేడి చేయండి. నీరు మరుగుతున్నప్పుడు 4 టమాటాలు వేసి 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పైన పొట్టు తీయండి. వీటిని మిక్సీ గిన్నెలో వేయండి. అలాగే మిక్సీలో అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు అదే వాటర్​లో రైస్​ ఉడికించుకోవడానికి కావాల్సిన మసాలా దినుసులు, కొద్దిగా ఉప్పు వేసుకుని నీటిని మరగనివ్వండి.
  • తర్వాత ఇందులో నానబెట్టుకున్న బియ్యం వేసుకుని 80 శాతం ఉడికించుకోండి.
  • రైస్​ని జాలి గరిటె సహాయంతో మరొక గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో నూనె, నెయ్యి వేసి వేడి చేయండి.
  • ఇందులో సన్నగా కట్​ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి.. గోల్డెన్​ కలర్లో ఫ్రై చేయండి. వీటిలో సగం ఉల్లిపాయలు ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • తర్వాత మసాలా దినుసులు అన్నీ వేసుకుని కలపండి.
  • ఇందులోనే టమాటా ప్యూరీ వేసి మిక్స్​ చేయండి. ఒక నిమిషం తర్వాత టమాటా ముక్కలు వేసి కలపండి.
  • అలాగే కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి కలపండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో​ పెట్టి టమాటాలకు మసాలా మిశ్రమం బాగా పట్టేలా కలపాలి.
  • తర్వాత ఉడికించుకున్న రైస్​ వేయాలి. పైన ఫ్రైడ్​ ఆనియన్స్​, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా కుంకుమ పువ్వు వాటర్​ చల్లుకుని మూత పెట్టాలి.
  • సన్నని మంట మీద 10 నిమిషాలు దమ్​ పెట్టుకుని స్టౌ ఆఫ్ చేయాలి. అంతే ఇలా చేస్తే ఘుమఘుమలాడే టమాటా దమ్​ బిర్యానీ మీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ విధంగా దమ్​ బిర్యానీ ఇంట్లో చేసేయండి.

కార్తికమాసం స్పెషల్​ - ఉల్లిపాయలు లేని "పూరీ కర్రీ" - టేస్ట్​ సూపర్​ - చపాతీల్లోకి కూడా పర్ఫెక్ట్​!

అప్పటికప్పుడు తయారు చేసే "కమ్మటి ఉసిరికాయ చట్నీ"- ఇలా చేస్తే టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.