ETV Bharat / state

అల్లు అర్జున్​కు ఊరట - కేసు క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశం - ALLU ARJUN CASE DISMISSED

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని అల్లు అర్జున్‌పై నంద్యాలలో కేసు నమోదు - కేసును కొట్టివేయాలని ఆదేశించిన హై కోర్టు

Allu Arjun Case Dismissed
High Court Allu Arjun Case Dismissed (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 6, 2024, 12:13 PM IST

Updated : Nov 6, 2024, 1:26 PM IST

AP High Court Dismissed Allu Arjun Case : సినీ నటుడు అల్లు అర్జున్‌, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. తాజాగా హైకోర్టు వీరిద్దరిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆదేశాలు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్‌ అనుమతి లేకుండా నంద్యాలలో ర్యాలీ నిర్వహించడంపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అల్లుఅర్జున్‌ తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా ఆయనపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఉన్నత న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగింది : ఏపీ ఎన్నికల సమయంలో సినీ నటుడు అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్‌ రెడ్డి ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆయన అభిమానులు పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనకు స్వాగతం పలికారు. ఆయన పర్యటనకు అధికారికంగా ఎలాంటి అనుమతులూ లేకపోయినా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో ఇద్దరు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేటు వేశారు.

ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అల్లు అర్జున్‌, శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డిలపై అప్పట్లో నంద్యాల టూ టౌన్​ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తమపై వేసిన కేసులను కొట్టేయాలంటూ అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీ హైకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా నవంబరు 6 వరకు తదుపరి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు నేడు వీరిద్దరిపై ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంగతికి వస్తే ఆయన ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నాడు. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, స్పెషల్ పోస్టర్స్​ ఈ సినిమాపై అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. రిలీజ్​కు ఇంకా నెలరోజులే టైమ్ ఉండటంతో అభిమానుల ఆసక్తి కూడా ఇంతకింత పెరిగిపోతోంది. మరోవైపు ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల ఓ స్పెషల్ సాంగ్​లో చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ అవ్వగా అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హీరో అల్లు అర్జున్​కు హైకోర్టులో ఊరట - నవంబరు 6వరకు రిలీఫ్​

పుష్ప క్లైమాక్స్ షూటింగ్- రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ - Pushpa At RFC

Last Updated : Nov 6, 2024, 1:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.