ETV Bharat / state

హైకోర్టు వ్యాఖ్యలు సర్కార్‌కు చెంపపెట్టు: కోమటిరెడ్డి - Telangana news

టీఎస్‌పీఎస్‌సీపై హైకోర్టు వ్యాఖ్యలు తెలంగాణ ప్రభుత్వానికి చెంపపెట్టని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఖాళీగా ఉన్న ఛైర్మన్, స‌భ్యుల విష‌యంలో హైకోర్టు జోక్యం చేసుకున్నందుకు ఆయన కృత‌జ్ఞతలు తెలిపారు.

mp
mp
author img

By

Published : Apr 29, 2021, 4:49 PM IST

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు సర్కార్‌కు చెంపపెట్టు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. క‌మిష‌న్‌లో పోస్టులు భ‌ర్తీచేయ‌కుంటే టీఎస్‌పీఎస్‌సీని మూసివేయాలన్న హైకోర్టు మాట‌లు ఉద్యోగాల భ‌ర్తీ ప‌ట్ల స‌ర్కార్ చిత్త శుద్దిని తెలియ‌జేస్తోందన్నారు. టీఎస్‌పీఎస్‌సీలో ఖాళీగా ఉన్న ఛైర్మన్, స‌భ్యుల విష‌యంలో హైకోర్టు జోక్యం చేసుకున్నందుకు కృత‌జ్ఞతలు తెలిపారు.

ఉద్యోగ నోటిఫికేషన్ విష‌యంలో స‌ర్కార్ ఒంటెద్దు పోక‌ డ‌ల‌తో వెళుతుంద‌ని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా హైకోర్టు వ్యాఖ్యల‌తో అయినా కోర్టు చెప్పిన‌ట్లు 4 వారాల్లో క‌మిష‌న్‌లోని ఖాళీ పోస్టులను భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. నోటిఫికేష‌న్లు విడుదల చేయ‌డంలో స‌ర్కార్ జాప్యంతో ఎంతో మంది యువ‌కులు ఉద్యోగాలు రావ‌నే బెంగ‌తో ప్రాణాలు తీసుకుంటున్నార‌న్నారు. కొద్ది రోజుల క్రితం కేయూ విద్యార్థి సునీల్ నాయ‌క్ ఉద్యోగ నోటిఫికేష‌న్లు లేవ‌ని బాధ‌తో పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విష‌యాన్ని ఆయన గుర్తు చేశారు. యువకుల మ‌ర‌ణాల‌కు స‌ర్కార్‌ బాధ్యత వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. త‌న ఇంట్లో ప‌ద‌వులు ఇచ్చుకున్న కేసీఆర్... తెలంగాణ కోసం కోట్లాడిన యువ‌త‌కు మాత్రం మొండి చెయ్యి చూపిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.