ETV Bharat / state

రాహుల్‌ను కలిసిన కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి - Revanth Reddy Komati Reddy meets Rahul gandhi

పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు కొనసాగుతున్న వేళ... ఆశావహులు, వారి మద్దతుదారులు దిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పీసీసీ అధ్యక్ష రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ ఉండగా... ఎక్కువ మంది రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే.. రేవంత్‌కు అవకాశం ఇస్తే కొంతమంది సీనియర్లు పార్టీని వీడే అవకాశం ఉన్నదని అధిష్ఠానం భావిస్తోంది.

Komati Reddy and Revanth Reddy meets Rahul gandhi
రాహుల్‌ను కలిసిన కోమటిరెడ్డి, రేవంత్‌రెడ్డి
author img

By

Published : Dec 17, 2020, 6:58 AM IST

పీసీసీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న కోమటిరెడ్డి, మధుయాష్కీ, రేవంత్ రెడ్డి దిల్లీ బాట పట్టారు. పార్లమెంటరీ స్థాయి సంఘం సమావేశాల్లో హాజరయ్యేందుకు దిల్లీ వెళ్లిన రేవంత్‌...పీసీసీ అధ్యక్ష వ్యవహారంపై ఎవరితోనూ చర్చించలేదని పేర్కొన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాత్రం పార్టీ సీనియర్లతో కలుస్తునట్టు వెల్లడించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ ఇంఛార్జీ మణికం ఠాకూర్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యి తనకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

రక్షణ శాఖ స్థాయి సంఘంలో హాజరయ్యేందుకు పార్లమెంటుకు వెళ్లిన రాహుల్ గాంధీని కలిసి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని కోమటిరెడ్డి కోరారు. అటు.. మధుయాష్కీ కూడా పార్టీ అధిష్టానం పెద్దలను కలిసి అవకాశం కల్పించాలని కోరారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు కూడా దిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.

పార్టీని ఇంతకాలం అంటిపెట్టుకుని ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని వారు అధిష్టానం నేతలను కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీగా ఉన్న మాణికం ఠాకూర్... తన సొంత నియోజకవర్గం పర్యటనకు తమిళనాడుకు వెళ్లారు. ఆయన తిరిగి ఈనెల 23కు దిల్లీ వెళ్లనున్నారు. ఆ తర్వాతే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కసరత్తు పూర్తి అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి : క్షణక్షణం భయం భయం... రాష్ట్ర సరిహద్దు గ్రామాలకు పులి గిలి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.