గిరిజన పోరాటయోధుడు కుమురం భీం 79వ వర్ధంతిని గిరిజన ఐక్య వేదిక హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్పై ఉన్న విగ్రహానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపకులపతి జస్టిస్ నర్సింహారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
జల్, జంగిల్, జమీన్ కోసం ఎంతో పోరాటం చేసిన మహా వీరుడు కుమురం భీం అని జస్టిస్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఆదివాసీల కోసం తన ప్రాణాలను అర్పించిన గొప్ప వీరుడు అని కొనియాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన హక్కులను కాలరాస్తున్నాయని... పాలకులు ఇదే విధానం అవలంబిస్తే... కుమురం భీం బాటలో నడిచి హక్కులను సాధించుకుంటామని గిరిజన ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు వివేక్ వినాయక్ హెచ్చరించారు. ఈ సందర్బంగా గిరిజన కళా బృందాలు చేసిన థిస్సా, కొమ్ము నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి: ఐడియా అదుర్స్... మేకల నోటికి "హరిత" తాళం!