మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంతో పాటు సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో చోరీ ఘటనపై ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది …కొత్తపేటలోని ఆయన అల్లుడికి చెందిన ఆసుపత్రికి తరలించారు. కోడెలను అత్యవసర విభాగంలో ఉంచారు. ప్రస్తుతం కోడెల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన బావమరిది అంజయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
నిలకడగా కోడెల ఆరోగ్యపరిస్థితి
ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి నిన్న రాత్రి కొంత ఆందోళనకరంగా ఉన్నప్పటికీ... ప్రస్తుతం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
మాజీ శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు ఛాతి నొప్పితో ఆస్పత్రిలో చేరారు. గుంటూరులోని శ్రీలక్ష్మి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అసెంబ్లీ ఫర్నిచర్ తరలింపు వ్యవహారంతో పాటు సత్తెనపల్లిలోని తన కార్యాలయంలో చోరీ ఘటనపై ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వ్యక్తిగత సిబ్బంది …కొత్తపేటలోని ఆయన అల్లుడికి చెందిన ఆసుపత్రికి తరలించారు. కోడెలను అత్యవసర విభాగంలో ఉంచారు. ప్రస్తుతం కోడెల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆయన బావమరిది అంజయ్య తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక వైద్య బృందం వచ్చి చికిత్స అందిస్తున్నారని తెలిపారు.
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి చేర్చాల్సిన బాధ్యత గ్రామ వాలంట్రీలపైనే ఉందని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సహనం, ఓర్పుతో విధులు నిర్వహిస్తూ, పార్టీలు చూడకుండా పేదలందరికీ ప్రభుత్వ ఫలాలు అందేలా పని చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వార్డు వాలంటీర్ల సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మూడు నెలల్లోనే నాలుగున్నర లక్షల మందికి ఉపాధి అవకాశం కల్పించడంతో పాటు, మొదటి ఏడాదే 80శాతం మ్యానిఫెస్టోను అమలు చేయబోతున్న ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. వాలంటీర్లు సమర్థవంతంగా పని చేస్తే రానున్న ఎన్నికల్లో 75 శాతం ఓట్లు జగన్ కే వస్తాయన్నారు.
బైట్: అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291