ETV Bharat / state

మధుయాష్కికి సంపూర్ణ మద్దతు తెలిపిన కోదండరాం - ఎల్బీనగర్​లో మధుయాష్కికి సమస్యలు

Kodandaram Support LB Nagar Candidate Madhu Yashki : ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కికే సంపూర్ణ మద్దతు అంటూ టీజేఎస్ అధినేత కోదంరాం స్పష్టం చేశారు. మధుయాష్కి గెలుపుకు అందరూ కృషి చేయాలని కోరారు. వీరిరువురు పలు రకాల రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

LB Nagar Candidate Madhu Yashki
Kodandaram Support LB Nagar Candidate Madhu Yashki
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 8:07 PM IST

Kodandaram Support LB Nagar Candidate Madhu Yashki : ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కి గౌడ్​తో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం భేటీ అయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో టీజేఎస్.. మధుయాష్కికే తన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు కోదండరాం ప్రకటించారు. నియోజకవర్గంలోని టీజేఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మధుయాష్కి(Madhu Yashki) గెలుపునకు స్వచ్ఛందంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. వీరిరువురు పలు రకాల రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

గత నాలుగేళ్లుగా ఎల్బీనగర్ టికెట్ ఆశిస్తున్న మల్​రెడ్డి రామిరెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారంలో ఉన్నారు. కాంగ్రెస్ రెండో జాబితాలో తన పేరు వస్తుందని ఆశగా ఎదురు చూసిన ఆయనకు.. చివరికి భంగపాటు తప్పలేదు. తనకు బదులు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీకి టికెట్​ను కేటాయిస్తూ.. అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. దీంతో మధుయాష్కీపై టికెట్ ఆశించిన నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో మధుయాష్కీ పెట్టిన సమావేశాలకు వారంతా దూరంగా ఉంటూ బహిరంగంగానే అసంతృప్తిని ప్రకటించారు.

ప్రచారంలో కాంగ్రెస్​ తగ్గేదేలే- ఉచిత హామీలతో ఓటర్లలో ఫుల్​ జోష్​, డైలమాలో బీజేపీ!

Telangana Assembly Election 2023 : అలాగే ఈ ఎన్నికల్లో ఎలాగైనా కేసీఆర్​ను ఓడించాలనే లక్ష్యంతో ఉన్న టీజేఎస్ అధినేత కోదండరాం.. కాంగ్రెస్​తో జత కట్టేందుకు సిద్ధపడ్డారు. బహిరంగంగానే బీఆర్​ఎస్​పై విమర్శలు చేసేవారు. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో రెండు రోజుల క్రితం భేటీ అయి.. కేసీఆర్ నిరంకుశ పాలనను దించేందుకు కాంగ్రెస్​తో జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రజా పరిపాలన కోసం టీజేఎస్ పూర్తి మద్దతు కాంగ్రెస్​కేనని స్పష్టం చేశారు. అందరం కలిసికట్టుగా కేసీఆర్​ను ఓడించి.. నవ తెలంగాణను నిర్మించుకోవాలని రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం వివరించారు.

Telangana Congress Plan for Election : ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. అందుకు తగ్గట్లే తన వ్యూహాలను సైతం అమలు చేస్తోంది. తనతో కలిసి వచ్చిన పార్టీలను వదులుకోకుండా వారితో దోస్తీ చేస్తూ.. ముందుకు పోతుంది. కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను జోరుగా ప్రజల్లోకి తీసుకెళుతుంది. తాము అధికారంలోకి వస్తే.. వాటిని వెంటనే అమలు చేస్తామని బహిరంగ సభల్లో వివరిస్తున్నారు. కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్రల పేరుతో జనాల్లోకి వెళ్లి.. బీఆర్​ఎస్​ పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నేతలను తీసుకువచ్చి.. భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఎలా ఆకర్షించాలో.. కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను సిద్ధం చేస్తుంది. అలాగే వివిధ పార్టీల నుంచి వారిని జోరుగా చేర్చుకుంటున్నారు.

Telangana Congress MLA Candidates Second List : కీలక స్థానాలతో కాంగ్రెస్ రెండో జాబితా.. లిస్టులో గద్దర్ కుమార్తె, అజహరుద్దీన్

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.