మానుకోట Manukota) స్ఫూర్తితో తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని తెలంగాణ జన సమితి (TJS) రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం (kodandaram ) అన్నారు. తెలంగాణ ఉద్యమంలో మానుకోట తిరుగుబాటు(manukota revolt) జరిగి 11 ఏళ్లు పూర్తైన సందర్భంగా హైదరాబాద్ గన్ పార్క్ (gun park) వద్ద అమరవీరుల స్థూపానికి పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నివాళులర్పించారు. సమైక్యవాదానికి వ్యతిరేకంగా ప్రత్యేక తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించారని కోదండరాం తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర అకాంక్ష కోసం వరంగల్ పట్టణంలో రాజ్‌కుమార్ ఆత్మహుతి చేసుకున్నాడని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ... ఇంకా ఆత్మగౌరవ పోరాటం చేస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మగౌరవమైన మానుకోట ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరంగా ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెరాస (TRS) పాలన అంతా అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు.