ఓయూ భూములు పరిరక్షించాలంటూ రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డికి తెజస అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి వినతిపత్రం అందించారు. భూముల పరిరక్షించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తామని చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ఓయూకు ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించి భూములు పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ చరిత్ర ఓయూతో ముడిపడి ఉందని కోదండరాం అన్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న వర్సిటీ భూములు కబ్జాకు గురికావడం దురదృష్టకరమని చెప్పారు. ఓయూ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తామని వెల్లడించారు.
ఇవీ చూడండి: పుల్వామాలో భారీ ఉగ్రదాడికి కుట్ర..!