ETV Bharat / state

సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా సర్కార్ ప్లాన్ - ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్​ - Kites and Sweets Festival hyderabad

Kites and Sweets Festival At Hyderabad : హైదరాబాద్​లో సంక్రాంతి సంబురాలను అంబరాన్ని తాకేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వేడుకలకు సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్​ను నిర్వహిస్తోంది. 16 దేశాల నుంచి నిపుణులైన 100 మంది కైట్ ప్లేయర్స్ రకరకాల గాలిపటాలను ఈ వేడుకల్లో ఎగురవేయనున్నారు. అలాగే స్థానిక మహిళలు తయారు చేసిన సుమారు 400 రకాల మిఠాయిలు ఈ ఉత్సవాల్లో నోరూరించబోతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ వేడుకలను ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది.

Kites and Sweets Festival At Hyderabad
Kites and Sweets Festival
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 12, 2024, 9:26 PM IST

Updated : Jan 13, 2024, 6:52 AM IST

సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా సర్కార్ ప్లాన్ - ఇవాళ్టి నుంచి 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్​

Kites and Sweets Festival At Hyderabad : సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకోబోతుంది. కరోనా కారణంగా 2021 నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్​ను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ పర్యాటక శాఖ, సాంస్కృతి శాఖ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఈ నెల 15 వరకు మూడు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా అధికారులు మధ్యాహ్నం కైట్ ఫెస్టివల్​ను లాంఛనంగా ప్రారంభించనున్నారు.

Congress Govt to Organize kites Ceremony at Hyderabad : ఈ వేడుకల్లో పాల్గొనేందుకు నగర పౌరులకు ఉచితంగా అవకాశాన్ని కల్పించారు. ఈ సరదాల సంక్రాంతి ఉత్సవాల్లో ప్రజలకు కావల్సిన వినోదంతో పాటు పసందైన రుచులు కూడా అందుబాటులో ఉండనున్నాయి. ఇండోనేషియా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, థాయిలాండ్, కొరియా, ఇటలీ, తైవాన్, నెదర్లాండ్ సహా 16 దేశల నుంచి నిపుణులైన అంతర్జాతీయ కైట్ ప్లేయర్ 40 మంది, వివిధ రాష్ట్రాల నుంచి 60 మంది కైట్ ప్లేయర్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సాధారణ గాలిపటాల కంటే భారీ పరిమాణంలో ఉన్న వివిధ ఆకృతుల్లో తయారు చేసిన పతంగులను ఎగురవేయనున్నారు. రాత్రివేళ ఎగిరే పతంగులు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.

గాలిపటం దారంపై జాతీయ గేయం- 20 నిమిషాల్లోనే రాసి రికార్డు- 3మి.మీ పుస్తకంలో హనుమాన్ చాలీసా!

Kites and Sweets Festival Start Jan 13th in Hyderabad : 2016-17లో అగాఖాన్ అకాడమీలో కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఆ తర్వాత మూడేళ్లు రాష్ట్ర ప్రభుత్వం పరేడ్ మైదానంలో అధికారికంగా పతంగుల పండుగను నిర్వహించింది. ఆ మూడు సంవత్సరాలు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై వేడుకలను తిలకించారు. కరోనా కారణంగా మూడేళ్లు కైట్ ఫైస్టివల్​కు నగరవాసులు దూరమయ్యారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం కావడంతో ఆ వేడుకలను పునరుద్ధరించాలని నిర్ణయంచిన ప్రభుత్వం, ఈ ఏడాది భారీ స్థాయిలో వేడుకలకు ఏర్పాటు చేసింది.

Kites and Sweets Festival 2024 : కైట్ ఫెస్టివల్​తో పాటు ప్రాంతీయ కళలు, చేతి వృత్తులు, తెలంగాణ వంటకాలతో కూడిన స్టాల్స్ సందర్శకులకు నోరూరించనున్నాయి. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు అవకాశం కల్పించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇళ్ల వద్ద తయారుచేసిన 400 రకాల మిఠాయిలతో పాటు పిండివంటలు, తెలంగాణ వంటకాలను ఈ వేడుకల్లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే తెలంగాణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు ఉత్సవాలకు మరింత శోభను చేకూర్చనున్నారు.

ప్రవేశం అందరికి ఉచితం : సుమారు మూడు రోజుల్లో 10 లక్షల వరకు ఈ వేడుకలకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా అదనంగా పెంచారు. ప్రవేశం అందరికి ఉచితంగా కల్పించారు. ఇలాంటి ఉత్సవాల ద్వారా పర్యాటకులను ఆకర్షించడంతో పాటు పర్యాటకంగా నగరం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఖరీదైన స్వర్ణ పతంగి.. దారం, చరకా సైతం బంగారంతోనే.. ఖర్చు ఎంతో తెలుసా

కైట్స్ అండ్​ స్వీట్స్ ఫెస్టివల్​కు సీఎం రేవంత్​రెడ్డికి ఆహ్వానం

Last Updated : Jan 13, 2024, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.