హైదరాబాద్‌లో వచ్చే నెల 13 నుంచి మూడు రోజులపాటు అంతర్జాతీయ గాలిపటాలు, మిఠాయిల పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. పర్యాటకశాఖ అధికారులు, స్వీట్ ఫెస్టివల్ నిర్వాహకులు, కైట్ ప్లేయర్స్ సమన్వయకర్తలతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు ఉండాలని మంత్రి పేర్కొన్నారు.
కైట్, స్వీట్‌కు తోడు ఎంటర్టైన్మెంట్...
కైట్ ఫెస్టివల్‌కు ప్రపంచంలోని వివిధ దేశాలలో గుర్తింపు ఉన్న క్లబ్‌లను ఆహ్వానించి పాల్గొనేలా ఏర్పాటు చేయాలని సూచించారు. వివిధ దేశాల స్వీట్ వెరైటీలను ప్రదర్శనలో ఉంచేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లోనూ నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. మూడు రోజుల పాటు సాగనున్న పండుగలో తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళా ప్రదర్శనలు నిర్వహించాలని మంత్రి వివరించారు.
ఇవీ చూడండి: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు