Kite Festival in Hyderabad: హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో పతంగుల పండుగ సందడిగా జరుగుతోంది. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వచ్చి... గాలిపటాలను ఎగురవేయిస్తున్నారు. పీపుల్స్ ప్లాజాలో జరిగిన వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు. పతంగులు ఎగురవేసి సందడి చేశారు.
'చిన్నతనంలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే 3 నెలల ముందు నుంచే పతంగి సంబురాలు జరిగేవి. ఇప్పుడు కాలక్రమేణా వేడుకలు చేసుకోవడం తగ్గిపోయింది. ఇప్పుడు స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చి ఇలా పతంగులు ఎగురవేస్తూ సందడి చేయడం చాలా బాగుంది. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి.'
--- తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి
బాల్యంలో సంక్రాంతి పండుగ వస్తుందంటే.... 3 నెలల ముందు నుంచే గాలిపటాలు తయారు చేసుకునేవారమని తలసాని గుర్తుచేసుకున్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు నేర్పించాలని కోరారు. ప్రజలు సంతోషంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: Kodipandalu 2022: మూడు రోజులుగా కోడిపందెలు.. ఏపీలో కాదండి.. మనదగ్గరే!