ETV Bharat / state

Kishan Reddy Latest News : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న కిషన్‌రెడ్డి - కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తాజా వార్తలు

Kishan Reddy will take charge as Telangana BJP president tomorrow : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని కార్యాలయంలో పార్టీ పగ్గాలు అందుకోనున్నారు.

Kishan Reddy Latest News
Kishan Reddy Latest News
author img

By

Published : Jul 20, 2023, 5:37 PM IST

Updated : Jul 20, 2023, 6:28 PM IST

Telangana BJP President Kishan Reddy News : బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన కేంద్రమంత్రి కిషన్​రెడ్డి.. రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 7:30 గంటలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం బషీర్​బాగ్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్న కిషన్​రెడ్డి.. అక్కడి నుంచి నేరుగా అంబర్​పేటలోని మహాత్మా జ్యోతిభా పూలే విగ్రహం వద్దకు చేరుకోనున్నారు.

పూలేకు నివాళులు అర్పించి.. 9:25 గంటలకు ట్యాంక్​ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత గన్​ పార్క్ అమర వీరుల స్థూపం వద్ద ఆయన నివాళులు అర్పించనున్నారు. నివాళుల అనంతరం అమరవీరుల స్థూపం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.

2024 సార్వత్రిక ఎన్నికలు, ఈ ఏడాది జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల ముందు బీజేపీ పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించింది. తెలంగాణకు బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్​కు సోము వీర్రాజు స్థానంలో దగ్గుబాటి పురందేశ్వరిని నియమించింది. వీరితో పాటు పంజాబ్‌కు సునీల్‌ జాఖఢ్‌, ఝార్ఖండ్‌కు బాబూలాల్‌ మరాండీలను నియమించింది. ఈ మేరకు ఈ నెల 4న బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటి నుంచి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్​ పర్యటన తర్వాత పార్టీ పగ్గాలు చేపడతానని గతంలో చెప్పినా.. అనివార్య కారణాల వల్ల అది కాస్త ఆలస్యమవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే రేపు బాధ్యతలు స్వీకరించనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్​ సైతం విడుదల చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చూడండి..

Kishanreddy As Telangana BJP President : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్​రెడ్డి

BJP Change Telangana President : కీలకమైన ఎన్నికల సమయంలో.. సారథ్య బాధ్యతలకు దూరమైన సంజయ్‌

BJP Presidents Meeting Hyderabad : 'దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమే లక్ష్యం'

Last Updated : Jul 20, 2023, 6:28 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.