చిన్నారులపై అత్యాచారాలు, మహిళలపై లైంగిక దాడుల నిరోధానికి ప్రత్యేక చట్టాలను తెస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. దేశంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు కలిసివస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని పలు డివిజన్లలో పాదయాత్రలో స్థానికులు నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తానెప్పుడు వారికి అందుబాటులో ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు.
తెరాస అన్ని విషయాల్లో విఫలం
చిన్నారులపై దాడులను అరికట్టడంలో తెరాస సర్కారు అన్నివిధాలుగా విఫలమైందని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో భాజపాను బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:అమెరికాలో నరేంద్ర మోదీ సభకు 70వేల మంది!