Kishan Reddy Taking Charge On BJP State President : తెలంగాణ బీజేపీ నూతన సారథిగా కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి నాలుగోసారి బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 12:40 గంటలకు నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో హైకమాండ్ ఆదేశాలను అనుసరించి ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఉదయం 7 గంటల 30 నిమిషాలకు పాతబస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 8:20 గంటలకు అంబర్‌పేటకు చేరుకుని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాం వద్ద నివాళులు అర్పించారు. అక్కడి నుంచి నేరుగా బషీర్‌బాగ్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయానికి 8:50 గంటలకు చేరుకొని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం గన్‌పార్క్ వద్ద ఉన్న అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.
Kishan Reddy Rally at Gunpark : అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా చేరుకున్నారు. కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావుతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న సమయం ప్రకారం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్నప్పటికీ.. వర్షం కారణంగా మధ్యాహ్నం 12:40 గంటలకు ఆయన బీజేపీ రాష్ట్ర రథ సారథిగా బాధ్యతలు స్వీకరించారు.
బీజేపీ సారధిగా నాల్గొసారి బాధ్యతలు స్వీకరణ: తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను అనసరించి బీజేపీ హైకమాండ్ కొద్ది రోజుల క్రితం పార్టీ పదవుల్లో స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే.. అంతకు ముందు వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిన బండి సంజయ్‌ను తొలగించి కిషన్‌రెడ్డిని నియమించింది. దీంతో ఆయన నాల్గొసారి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా కిషన్‌రెడ్డి నిల్చిపోనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండు పర్యాయాలు, తెలంగాణకు తొలి రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన కిషన్‌రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు.
బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్షుడి హోదాలో తొలి కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ఎన్నికలకు సన్నద్ధం, బీఆర్ఎస్పై ఉద్యమ కార్యాచరణ అంశాలపైన చర్చించనున్నారు.
ఇవీ చదవండి: