సికింద్రాబాద్ పార్లమెంట్ భాజపా అభ్యర్థి కిషన్ రెడ్డి వారాసిగూడ నుంచి రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ రోడ్ షో వారాసిగూడ, అంబర్ నగర్, బౌద్ధనగర్, సీతాఫల్ మండి మీదుగా సికింద్రాబాద్ వైపు సాగింది. దేశం అభివృద్ధి పథంలో నడవాలంటే మోదీని ఎన్నుకోవాలని స్థానిక ప్రజలకు వెన్నంటే ఉంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:కమలం గూటికి మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్