ETV Bharat / state

మంచి ప్రభుత్వం కోసం ఓటు హక్కుని ఉపయోగించాలి: కిషన్‌రెడ్డి

రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

kishan-reddy-said-the-right-to-vote-must-be-exercised-for-good-government
మంచి ప్రభుత్వం కోసం ఓటు హక్కుని ఉపయోగించాలి: కిషన్‌రెడ్డి
author img

By

Published : Dec 1, 2020, 10:38 AM IST

మంచి ప్రభుత్వం కోసం ఓటు హక్కుని ఉపయోగించాలి: కిషన్‌రెడ్డి

డాక్టర్​ బాబా సాహెబ్​ అంబేద్కర్​ రూపొందించిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ప్రభుత్వాలు సరిగా పని చేయడం లేదని ప్రశ్నించడం కాదు. మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా సరియైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కాచిగూడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఓటు వేశారు. దీక్షా మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో... సతీమణి కావ్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదీ చూడండి : ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్సీ రాంచందర్​రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.