ఈ నెల 12న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీరనుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాగా వ్యవహరించి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విషయంలో రాజకీయాలు వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రైతులకు రామగుండం ఎరువుల కర్మాగారం ద్వారా ఎంతో లబ్ధి చేకూరనుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో రాష్ట్రంలో యూరియా కొరత విపరీతంగా ఉండేదని.. నిల్వల కోసం కేంద్రానికి లేఖలు రాశారని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్య అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్న కిషన్‌రెడ్డి.. రామగుండం ఫ్యాక్టరీతో వ్యవసాయ రంగానికి యూరియా అందుబాటులోకి వస్తుందని వివరించారు. ఇక ఇప్పటి నుంచి కేంద్రానికి లేఖలు రాయాల్సిన అవసరం లేదని.. తెలంగాణలో తక్కువ సమయంలోనే యూరియా అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాగా వ్యవహరించి.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు రావాలి. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణలో యూరియా కొరత తీరనుంది. గతంలో యూరియా కోసం కేంద్రానికి లేఖలు రాశారు. ఈరోజు యూరియా కోసం లేఖలు రాయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తక్కువ సమయంలోనే యూరియా అందుబాటులోకి రానుంది.- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
ఇవీ చూడండి..
రాష్ట్రానికి కల్పతరువు.. రామగుండం ఎరువు.. దీని ప్రత్యేకతలివే!