Kishan Reddy Participated in Rally Over Double Bed Room Houses : అర్హులైన పేదలందరికీ రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి గడియారం కూడలి వరకు జరిగిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం గడియారం కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తే.. తెలంగాణలో రెండు పడకల గదుల ఇళ్లు ఇస్తామన్న కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేంద్రం వాటా ఇస్తామని చెప్పినా.. సీఎం కేసీఆర్ అమలు చేయలేదని ఆరోపించారు. కోట్ల రూపాయలతో నిజాంలా ఇల్లు నిర్మించుకున్న కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీకి 10 ఎకరాల స్థలం, బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు, ఎమ్మెల్యేలకు క్యాంపు ఆఫీసులు నిర్మించారే తప్ప పేదలకు మాత్రం ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప.. పేదవాళ్లకు కొత్తగా రేషన్ కార్డులు ఇంత వరకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.
- KishanReddy on Telanana Floods : 'వరదలతో జనం అల్లాడుతుంటే.. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది'
- BJP Operation Akarsh In Telangana : పార్టీ బలోపేతంపైనే కమలనాథుల గురి.. చేరికలకు "ఆపరేషన్ ఆకర్ష్"
Kishan Reddy criticism of BRS : 2018 నుంచి కొత్త పింఛన్లు కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారని.. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి 9 ఏళ్లుగా ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి హామీ తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు పోశారని విమర్శించారు. రుణమాఫీ అమలు కాక రైతులు మొండి బకాయిదారులుగా మారి బ్యాంకుల్లో కొత్త అప్పులు పుట్టని పరిస్థితి నెలకొందన్నారు. బంగారు తెలంగాణ సంగతి పక్కన పెట్టి, దోపిడీలతో కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబమైందన్నారు. కాంట్రాక్టులు, ప్రాజెక్టులు, భూములు, ఇసుక, గ్రానైట్, మద్యం పేరిట బీఆర్‌ఎస్ దోపిడీ కొనసాగుతోందని, మిగులు బడ్జెట్ ఉండే తెలంగాణను లిక్కర్, అప్పుల తెలంగాణగా మార్చివేశారని ఆరోపించారు. బీసీ బంధు పేరిట మోసం తప్ప.. బీసీలకు న్యాయం చేయలేకపోయారని అభిప్రాయపడ్డారు.
"రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు అయినా ఉద్యోగాల భర్తీ జరగలేదు. యూనివర్సిటీల్లో అనేక ఖాళీలు ఉన్నాయి. ప్రశ్నపత్రాల లీకేజీతో నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. రైతులకు రుణాల మాఫీ జరగలేదు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం బంగారు కుటుంబం కాలేదు. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబం అయ్యింది. బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలు."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
DK Aruna fires on KCR : పాలమూరు అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరిగిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సొంతంగా ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్న హామీ నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదలందరికీ ఇళ్లు ఇస్తామని డీకే అరుణ హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి:
- DK Aruna Latest Comments on CM KCR : 'వర్షాలతో ప్రజలు కష్టాలు పడుతుంటే.. కేసీఆర్ ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారు'
- Kishan Reddy on Hyderabad Floods : 'హైదరాబాద్‌ను ఇస్తాంబుల్, వాషింగ్టన్ చేస్తానన్నారు.. ఇదేనా?'
- Etala Rajender On Guest Lecturers : 'గెస్ట్ లెక్చరర్స్‌కు ఉద్యోగ భద్రతతో పాటు.. 12నెలల జీతం ఇవ్వాలి'