Kishan Reddy Open Letter To Rahul Gandhi : తెలంగాణ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్న వేళ.. ప్రధాన పార్టీల విమర్శలు తారాస్థాయికి చేరాయి. ఎన్నికల సమయం మొదటి నుంచి అధికారపార్టీ ప్రతిపక్షాలు కలిసి రాజకీయం చేస్తున్నాయని ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన పార్టీలతో కాంగ్రెస్తో జట్టుకట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో సోనియాగాంధీ (Sonia Gandhi) యూపీఏ ఛైర్పర్సన్గా ఉండి కూడా 1200 మంది ఆత్మహత్య చేసుకున్నాకే రాష్ట్రాన్ని ఇచ్చారని తెలిపారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి బహిరంగా లేఖ రాశారు.
మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే : కిషన్ రెడ్డి
Kishan Reddy says BRS And Congress Are one Party : తెలంగాణ రాష్ట్రం విషయంలో మొదటి నుంచి బీజేపీకి స్పష్టమైన ఆలోచన ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోదని ఆరోపణలు చేశారు. తెలంగాణ ఏర్పడగానే.. కాంగ్రెస్ పార్టీవారు (Congress) కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకుని ఆశీర్వచనాలిచ్చారని గుర్తు చేశారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వెనక జరిగిన వాస్తవ కథనాలకు వాస్తవరూపం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని వివరించారు.
రాష్ట్రంలో మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే కుట్ర జరుగుతోంది: బండి సంజయ్
Kishan Reddy Fires on BRS and Congress Party : తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే.. తెరవెనుక కలిసి పనిచేయాలకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) దోస్తీ బట్టబయలైందన్నారు. కాంగ్రెస్ తీసుకునే ప్రతి నిర్ణయం వంచనే అని చెప్పారు. రాష్ట్రం కోసం చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్న మోసం బట్టబయలైందని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో మీ అపవిత్ర దోస్తీని ప్రజలు పసిగట్టారని తెలిపారు.
'ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూకుంభకోణం జరిగింది'
ప్రజలు ఇరుపార్టీలకు సరైన బుద్ధి చెప్పనున్నారని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉన్నాయని దీనికి కారణం.. కాంగ్రెస్ స్వార్థ బుద్ధి, రాజకీయ కుట్ర అని స్పష్టంగా అర్థమవుతూనే ఉందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబాలు అవినీతి పార్టీలన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు తెలంగాణ ప్రజలు ఈ రెండు పార్టీలకు సరైన బుద్ది చెబుతారని లేఖలో వివరించారు.
'బీజేపీకి అన్ని వర్గాల నుంచి మద్దతు - కాంగ్రెస్ ఫేక్ గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు'
రాష్ట్రంలో ప్రియాంక, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అన్న నినాదంతో ప్రజల్లోకి వెళుతున్నారు. దీన్ని కొట్టిపారేస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే అంటూ లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలలకో సీఎం వస్తారు : కిషన్రెడ్డి
ఎన్నికల్లో ఓట్లు పొందాలనే ఉద్దేశం తప్ప - కాంగ్రెస్ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు - కిషన్ రెడ్డి