Kishan Reddy on Tribal Development Scheme : గిరిజనుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆదివాసుల అభివృద్ధి పథకం సోమవారం ప్రారంభించబోతున్నారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఒక దళిత బిడ్డను, రెండోసారి ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన తీరు ప్రధాని మోదీ దళిత, గిరిజన బిడ్డలకు ఇచ్చే ప్రాధాన్యతకు అద్దం పడుతుందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ మేరకు మాట్లాడిన ఆయన ప్రధాన మంత్రి ఆదివాసుల అభివృద్ధి పథకం వివరాలను వెల్లడించారు.
మోదీతో పోటీకి దరిదాపుల్లో ఎవరూ లేరని సర్వేలన్నీ చెబుతున్నాయి : కిషన్‌రెడ్డి
నిర్లక్ష్యానికి గురైన 75 గిరిజన తెగల కోసం రూ.24,104 కోట్లు గత నవంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మొదటి విడతలో ఈ పథకాన్ని100 జిల్లాల్లో అమలు చేస్తున్నామని తెలిపారు. వివిధ తెగలకు చెందిన గిరిజన లబ్ధిదారులను(Tribal Development Scheme) గుర్తించి, వారికి లక్ష ఇళ్లు అందించనున్నామని వెల్లడించారు. వేయి కిలోమీటర్ల వరకు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేస్తామని తెలిపారు. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. 100 వసతి గృహాలు, 200 కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేపట్టబోతున్నామని హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ : కిషన్ రెడ్డి
గిరిజనులకు ఆయుష్మాన్ కార్డులు, ఆధార్ కార్డులు అందజేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. 18 రాష్ట్రాల్లో 22 వేల గ్రామాల్లో 39 లక్షల వరకు 75 తెగలకు చెందిన గిరిజనులు నివసిస్తున్నారని పేర్కొన్నారు. గిరిజనులకు కనీస మౌలిక సదుపాయాలు రోడ్లు, నీరు, ఇళ్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీల వంటి సౌకర్యాలు కల్పించాలనే విప్లవాత్మక నిర్ణయాన్ని కేంద్రం తీసుకుందన్నారు. గిరిజన తెగలకు 49,9016 కుల ధృవీకరణ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులను సోమవారం అందజేస్తారని వివరించారు.
"నిర్లక్ష్యానికి గురైన 75 గిరిజన తెగల కోసం రూ. 24,104 కోట్లు గత నవంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. మొదటి విడతలో ఈ పథకాన్ని 100 జిల్లాల్లో అమలు చేస్తున్నాం. లబ్ధిదారులను గుర్తించి లక్ష ఇళ్లు అందిస్తాం. వేయి కిలోమీటర్ల వరకు రోడ్లు వేయనున్నాం. 100 మొబైల్ మెడికల్ యూనిట్స్ ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. 100 వసతి గృహాలు, 200 కమ్యూనిటీ హాళ్లు నిర్మాణం చేపట్టబోతున్నాం. ఆయుష్మాన్ కార్డులు, ఆధార్ కార్డులు అందజేస్తాం."- కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
"కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ - తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు"
Kishan Reddy Reaction on Bharat Nya Jodo Yatra : ఆదివాసీల అభివృద్ధి పథకంతో గిరిజనులకు సంపూర్ణ సాధికారత లభిస్తుందని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కుమురం భీం, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలకు సంబంధించిన 468 గ్రామాల గిరిజన వాసులకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టబోయే న్యాయ యాత్రపై కిషన్ రెడ్డి స్పందించారు. గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకునేందుకు కాంగ్రెస్ న్యాయ యాత్ర(Bharat Jodo Nyay Yatra) చేపడుతోందని విమర్శించారు.
ఆయోధ్యలో రామమందిరం నిర్మించాలనే వాజ్‌పేయీ కల సాకారం కాబోతుంది : కిషన్‌రెడ్డి