ETV Bharat / state

Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం : కిషన్ రెడ్డి - తెలంగాణ రాజకీయ వార్తలు

BJP President Kishan Reddy on Opponent Parties : రాష్ట్ర ఎన్నికలు దగ్గరపడటంతో ప్రధాన పార్టీలన్నీ త్వరితగతిన పావులు కదుపుతూ.. రాజకీయ సమీకరణాలలో దూకుడు పెంచాయి. కాషాయ దళం సైతం.. కేంద్ర పెద్దలను రాష్ట్రానికి రప్పించి సభలు ఏర్పాటు చేస్తున్నాయి. ఇవాళ నాంపల్లి పార్టీ కార్యాలయ సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి అధికారపక్షం బీఆర్ఎస్, దాని మిత్ర పక్షం ఎంఐఎం, విపక్ష హస్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

BJP Strategy on TS Assembly Elections 2023
BJP President Kishan Reddy on Opponent Parties
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 29, 2023, 5:16 PM IST

BJP President Kishan Reddy on Opponent Parties : తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బీసీను ముఖ్యమంత్రి చేస్తానన్న ప్రకటనతో.. బీసీ సంఘాల(BC Communities) నుంచి విశేష స్పందన వస్తుందన్న ఆయన.. దమ్ము, ధైర్యమున్న బీజేపీ పార్టీ.. తప్పకుండా చెప్పిన హామీని అమలు చేస్తుందన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో.. నిర్మల్‌ జిల్లాకు చెందిన పలువురు నేతలు.. కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయదళంలో చేరారు.

మెుదటి ఐదేళ్లు మహిళలకు మంత్రివర్గంలో కేసీఆర్‌ చోటు ఇవ్వలేదని.. దీనిని బట్టే ఆయన మహిళలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అర్థమవుతుందని విమర్శించారు. బీసీలకు అన్యాయం చేసిన చరిత్ర కాంగ్రెస్‌, బీఆర్​ఎస్​ పార్టీలదని.. ఎన్నికల్లో వారు ఇచ్చే సీట్లను బట్టే తెలుస్తుందన్నారు.

BJP Strategy on TS Assembly Elections : భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మైనార్టీ రిజర్వేషన్లు(Minority Reservations) రద్దు చేస్తామని కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచుతామని తెలిపారు. తొలి నుంచే కాషాయ పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీ అని గుర్తు చేశారు. అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత.. ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేసిన క్రెడిట్ ఒక్క బీజేపీకే సొంతమన్నారు.

Kishan Reddy Interesting Comments : 'అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి బీజేపీ సిద్ధం'

కాంగ్రెస్‌, బీఆర్​ఎస్ పార్టీలు(BRS Party) ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని కిషన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఓల్డ్‌సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్‌ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన దుస్థితి నెలకొందని విమర్శించారు. మజ్లిస్‌ పార్టీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్‌ బిల్లులు సైతం కట్టరని తెలిపారు. ఆ పార్టీ రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తోందని వివరించారు. ఓల్డ్‌సిటీలో ఎంఐఎం చేస్తున్నది తప్పు అని అధికారులు కూడా చెప్పలేకపోతున్నారని.. అటువంటి దౌర్బాగ్య పరిస్థితుల్లో ప్రభుత్వం ఉండటం హేయనీయమన్నారు.

BJP State President Kishan Reddy on Congress : కాంగ్రెస్ గ్యారెంటీల పేరుతో అవినీతికి.. మోసానికి గ్యారెంటీ ఇచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చేందుకు కర్ణాటకలో ఐదు గ్యారెంటీ పేరిట ఇచ్చిన హామీలు.. అమలులో మాత్రం శూన్యమని కేంద్రమంత్రి విమర్శించారు. ఇదే కోవలో తెలంగాణ ప్రజలు నమ్మించడానికి రాష్ట్రానికి వచ్చారని.. ఓటు వేస్తే మళ్లీ జనాలు మోసపోవటం పక్కా అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.

BJP Telangana Assembly Elections Strategy 2023 : బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లేలా వ్యూహాలు​.. RSS నేతలతో కలిసి ప్రచారంపై ప్రణాళికలు!

కాషాయ పార్టీకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని.. దేశంలోనే ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా(Ideal State) తెలంగాణ రూపుదిద్దుకోవటానికి సహకరించాలని కోరారు. ప్రజా ఆశీర్వాదం తోడైతే కేంద్రప్రభుత్వంతో కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్​తో ఈ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి పలికారు.

BJP President Kishan Reddy on Opponent Parties తెలంగాణలో సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం.. గ్యారెంటీ బూటక పార్టీలను నమ్మొద్దు : కిషన్ రెడ్డి

BJP Janasena Alliance in Telangana : బీజేపీ-జనసేన పొత్తు కుదిరింది..! ఇక సీట్ల లెక్క తేలాలి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.