ETV Bharat / state

Kishan Reddy on Hyderabad Floods : 'హైదరాబాద్​ను ఇస్తాంబుల్​, వాషింగ్టన్​ చేస్తానన్నారు.. ఇదేనా?'

Kishan Reddy Fires On CM KCR : హైదరాబాద్​ నగరాన్ని.. ఇస్తాంబుల్​, డల్లాస్, ​వాషింగ్టన్​ చేస్తామనే సీఎం కేసీఆర్ హామీలు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి ప్రశ్నించారు. ట్యాంక్​బండ్​లో మురికి నీరు తీసేసి.. కొబ్బరి నీళ్లు తీసుకువస్తానని మాట ఇచ్చిన ముఖ్యమంత్రిని ఇప్పుడు ఏం చేయాలని ధ్వజమెత్తారు. అంబర్​పేట్​ పటేల్​ నగర్​ నుంచి ముసారాంబాగ్​ బ్రిడ్జి​ వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్​ రెడ్డి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Minister Kishan Reddy
Minister Kishan Reddy
author img

By

Published : Jul 28, 2023, 7:25 PM IST

Kishan Reddy Visit Hyderabad Flood Areas : ముఖ్యమంత్రిగా కేసీఆర్​ ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్​ నగరాన్ని పట్టించుకోవాలని.. రానున్న రోజుల్లో నగర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లో కనీస సౌకర్యాలు కల్పించలేని బీఆర్​ఎస్​ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని ఆయన ఆరోపించారు. అంబర్​పేట్​ పటేల్​ నగర్​ నుంచి ముసారాంబాగ్​ బ్రిడ్జి వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్​ రెడ్డి.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

హైదరాబాద్​ నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి బీఆర్​ఎస్​ ప్రభుత్వం.. గత మున్సిపల్​ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని కిషన్​ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చక.. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ వరదలతో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షానికే భాగ్యనగర వాసులు ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.

Kishan Reddy Comments On CM KCR : ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ నగరాన్ని విశ్వనగరం చేస్తామని.. ఇస్తాంబుల్​, డల్లాస్​, వాషింగ్టన్​ చేస్తామని అనేక రకాల ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కానీ కింది స్థాయిలో ఏ రకమైన మార్పు లేదని, ట్యాంక్​ బండ్​లోని మురికినీరు తీసేసి.. కొబ్బరి నీళ్లు నింపుతానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచినీటి సమస్య, ఓట్ల సమస్య, వీధి దీపాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి ఎన్నో సమస్యలు విశ్వనగరంలోనే ఉన్నాయని మండిపడ్డారు.

"గత కొన్నేళ్లుగా చిన్నపాటి వర్షానికే భాగ్యనగర వాసులు ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్​ హైదరాబాద్​ నగరాన్ని విశ్వనగరం చేస్తామని.. ఇస్తాంబుల్​, డల్లాస్​, వాషింగ్టన్​ చేస్తామని అనేక రకాల ప్రకటనలు చేశారు. ట్యాంక్​ బండ్​లోని మురికినీరు తీసేసి.. కొబ్బరి నీళ్లు నింపుతానని చెప్పిన హామీ ఏమైంది. మంచినీటి సమస్య, ఓట్ల సమస్య, వీధి దీపాల నుంచి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి ఎన్నో సమస్యలు విశ్వనగరంలో ఉన్నాయి." -కిషన్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

హైదరాబాద్​ను ఇస్తాంబుల్​, డల్లాస్​, వాషింగ్టన్​ చేస్తాన్నారు.. ఇదేనా

ఎంతసేపూ ఆ నగరాలేనా అభివృద్ధి : రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు హైటెక్​ సిటీ, కొండాపూర్​, మాదాపూర్​లలో ఫ్లై ఓవర్లు, స్కై ఓవర్లు ఏర్పాటు చేయడం కాదని.. వాటికి రకరకాల రంగులు పూసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం తప్ప ఏం చేశారో చెప్పాలని కిషన్​రెడ్డి నిలదీశారు. హైదరాబాద్​లో పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే పాతబస్తీ వాసులపై ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని కిషన్​ రెడ్డి విమర్శలు చేశారు.

అంతకుముందు యూసుఫ్​గూడ డివిజన్​లోని వెంకటగిరిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్​రెడ్డి పర్యటించారు. పొంగిపొర్లుతున్న నాలాలను పరిశీలించారు. వాటి పరిస్థితిపై ఉన్నతాధికారులతో ఫోన్​లో మాట్లాడి.. సమస్య తీవ్రతను వివరించారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర ఆదేశాలతో అధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.