పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ వివాదంపై భాజపా నేత కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహలను నిర్మించాలే తప్ప వాటిని తొలగించకూడదని విమర్శించారు. సీఎం సొంత గ్రామంలో రోడ్డు వెడల్పు పేరుతో అంబేడ్కర్ విగ్రహాన్ని తొలగించారన్నారు. నాలుగేళ్లు గడిచినా పునఃపతిష్ట చేయకుండా అవమానించారని ధ్వజమెత్తారు. దళితులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కేసీఆర్ ఇంత హడావిడిగా ఎందుకు నిర్వహిస్తున్నారో తెలపాలని ప్రశ్నించారు. వాళ్లు కేవలం దో దిన్ కా సుల్తాన్లని ఎద్దేవా చేశారు.
ఇవీ చూడండి: 'మోదీ సేన' వ్యాఖ్యలపై నఖ్వీకి ఈసీ మందలింపు