ETV Bharat / state

రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలి : కిషన్ రెడ్డి - కాంగ్రెస్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

Kishan Reddy Fires On Congress : బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలని సవాల్ విసిరారు. మజ్లిస్​కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మాట్లాడటం లేదని మండిపడ్డారు. కేసీఆర్​తో ఇంత సాన్నిహిత్యం ఉన్నా ఒవైసీ బ్రదర్స్ ఎందుకు పాత బస్తీ అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.

Telangana Assembly Elections 2023
BJP President Kishan Reddy Fires On Congress Party
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 2:43 PM IST

Kishan Reddy Fires On Congress : బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీకి దమ్ముంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని నిరూపించాలని సవాల్ విసిరారు. ఆయనకు తెలంగాణ, బీజేపీ చరిత్ర తెలుసా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల డీఎన్ఏ, గోత్రాలు ఒక్కటేనని ఆరోపించారు. ఒవైసీ బ్రదర్స్ ఆదేశిస్తే.. కేసీఆర్ దేనికైనా తల ఊపుతారని.. కేసీఆర్​తో ఇంత సాన్నిహిత్యం ఉన్నా వాళ్లెందుకు పాతబస్తీని అభివృద్ధి చేయలేదని నిలదీశారు.

Telangana Assembly Elections 2023 : రజాకార్ల వారసత్వం కలిగిన మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ దరుసలాం ఇచ్చేసిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం హైదరాబాద్​లో ప్రకటనలు ఇస్తోందని.. తెలంగాణలో ఎన్నికలు జరుగుతుంటే ఏ ప్రాతిపాదికన కర్ణాటక ప్రభుత్వ సొమ్ముతో ప్రకటనలు ఇచ్చారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ప్రజలను మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేయడం ఎంత వరకు సమంజసమన్న కిషన్ రెడ్డి ఇదంతా తెలంగాణ ప్రజలు గుర్తించాలని కోరారు.

ఆఖరి ఘట్టానికి చేరుకున్న ఎన్నికల ప్రచారం-ఐదు రోజుల పాటు జాతీయ నేతల కోలాహలం

"కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్​కేసుల రాజ్యం వస్తుంది. రాహుల్ గాంధీకి సూటుకేసులు వెళతాయి. బీజేపీ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తాం. కామారెడ్డి, గజ్వేల్​లో ప్రజల నుంచి బీజేపీకు మంచి స్పందన వస్తుంది. ఈసారి రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయం. కామారెడ్డి, గజ్వేల్ లో బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుంది." - కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

డబ్బులు, మద్యం పంపిణీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధారపడ్డాయని కిషన్ రెడ్డి విమర్శించారు. ముందు సిరిసిల్లలో గెలిచి.. ఆ తరువాత గోషామహల్ బీజేపీ ఓటమి గురించి ఆలోచించాలని కేటీఆర్​కు హితవు పలికారు. బీఆర్ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే బీజేపీని గెలిపిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.

అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్షాల జోరు - ప్రచారంలో హోరెత్తిస్తున్న బీజేపీ జాతీయ నేతలు

ప్రధాని మోదీ చంద్రయాన్‌-3 విజయవంతం - కాంగ్రెస్‌ రాహుల్‌యాన్‌ విఫలం : అమిత్‌షా

బీజేపీ, బీఆర్ఎస్​లో ఉంటే పవిత్రులు - ప్రతిపక్షంలో ఉంటే ద్రోహులా? : రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.