Kishan Reddy Comments on KCR Meeting: రానున్న సాధారణ ఎన్నికల్లో వచ్చేది తమ ప్రభుత్వమేనని.. ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని కేసీఆర్ మీటర్లు పెడితే వాటిని కూడా తొలగిస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చండూరు సభలో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని భాజపా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కల్వకుంట్ల, అవినీతి పాలనను అంతమొందించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. కేసీఆర్ మాటలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చండూర్ సభలో అమలు చేయలేని హామీలు ఇచ్చారని.. కేసీఆర్ స్పీచ్ కొండను తవ్వి ఎలుకలు పట్టినట్లు ఉందని వెల్లడించారు. సీఎం మాటలు అభద్రతా భావంలో మాట్లాడినట్లు ఉందని.. గతంలో మాట్లాడిన మాటలే మళ్లీ మాట్లాడారని అన్నారు. ఆనాడు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. మునుగోడులో కేసీఆర్ ముందే ఓటమిని అంగీకరించారని తెలిపారు.
పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తూ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ చూపించారు.. ఆయన చూపించిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు ఏ పార్టీ ఎమ్మెల్యేలో ఒకసారి ముఖ్యమంత్రి చెప్పాలని కోరారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చిన వారు కాదా అని కేసీఆర్‌ని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదని అన్నారు. వివిధ పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను మీరు ఏ విధంగా పార్టీల్లో చేర్చుకున్నారో చెప్పాలన్నారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే కేసీఆర్ మళ్లీ ఇచ్చారు. ఈసారి కూడా నెరవేర్చని హామీలనే చండూరులో కేసీఆర్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తూ నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ చూపించారు. కేసీఆర్ చూపించిన నలుగురిలో ముగ్గురు ఏ పార్టీ ఎమ్మెల్యేలో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ చూపించిన నలుగురిలో ముగ్గురు వేరే పార్టీ నుంచి వచ్చిన వారే కదా? పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదు. ఎన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకున్నారో కేసీఆర్ మర్చిపోయారా? దేవరకొండ నుంచి గెలిచిన ఏకైక సీపీఐ ఎమ్మెల్యేను తెరాసలో చేర్చుకోలేదా? సీపీఐ, సీపీఎం నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజీనామా కూడా చేయించకుండా తెరాసలో చేర్చుకోలేదా? బీఎస్పీ, తెదేపా ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకోలేదా. తెదేపా ఎంపీ మల్లారెడ్డిని తెరాసలో చేర్చుకోలేదా?- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ఇప్పుడు కేసీఆర్ నీతులు మాట్లాడుతున్నారని.. అయితే దేవరకొండ నుంచి గెలిచిన ఏకైక సీపీఐ ఎమ్మెల్యేను తెరాసలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. అలాంటిది ఈరోజు సీపీఐ, సీపీఎం పార్టీలు తెరాస మద్దతిస్తున్నాయి.. దీనిపై సీపీఐ, సీపీఎం నేతలు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు. తెదేపా ఎంపీ మల్లారెడ్డిని ఏ విధంగా మీరు పార్టీలో చేర్చుకున్నారు.. అప్పుడు అది పార్టీ ఫిరాయింపు కాదా అని నిలదీశారు. బీఎస్పీ, తెదేపా ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకోలేదా? చెప్పండి.. మరి అప్పుడు పార్టీ ఫిరాయింపులోకి రాదా అని ఎద్దేవా చేశారు. రాజీనామా చేయించకుండా తెరాస పార్టీ అన్ని పార్టీ నాయకులను చేర్చుకుందన్నారు. అది పార్టీ ఫిరాయింపు కిందకి రాదా అని అన్నారు.
ఇవీ చదవండి: