మహాత్మగాంధీ 150వ జయంతి ఉత్సవాలు, 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మహాత్ముడి ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో గాంధీ చిన్నప్పటి నుంచి దేశ స్వాతంత్రం సిద్ధించేంత వరకు ఉన్న అరుదైన చిత్రమాలికను ఉంచారు. ఈ చిత్రాలు నవతరానికి ఉపయోగపడుతాయని కిషన్ రెడ్డి అన్నారు. అహింసా మార్గంతో శాంతి, స్వేచ్ఛ లక్ష్యాలుగా మహాత్మగాంధీ పోరాటాలు చేసి ఆదర్శంగా నిలిచారని అన్నారు. గాంధీ పోరాటాలను యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. హింసా, ఉగ్రవాదం ద్వారా ఎప్పుడు విజయం సాధించలేమని తెలిపారు. గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని... ప్రతీ ఒక్కరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని భాగస్వామ్యం కావాలని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కొత్త చట్టాలు తీసుకొస్తాం'