ETV Bharat / state

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఆ తేదీల్లో కాచిగూడ నుంచి 4 ప్రత్యేక రైళ్లు - SPECIAL TRAINS FOR SABARIMALA

శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు - ఏయే తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయంటే?

SPECIAL TRAINS FOR AYYAPPA DEVOTEES
Special Trains for Ayyappa Devotees in November (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2024, 2:03 PM IST

Updated : Nov 15, 2024, 2:42 PM IST

Special Trains for Ayyappa Devotees in November : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. కడప మీదుగా కేరళలోని కొట్టాయం, కొల్లాంలకు ఈ నెలలోనే 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టరు ఎ.జనార్దన్‌ వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ నెల 14, 21, 28 తేదీల్లో 07133 నంబరు గల రైలు కాచిగూడలో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరి, అదేరోజు రాత్రి 12.10 గంటలకు కడపకు చేరుకుంటుంది. తర్వాత రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07134 గల రైలు ఈనెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయం నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు, రాత్రి 11:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.

హైదరాబాద్‌లో ఈ నెలలో 19, 26వ తేదీల్లో 07135 నంబరు గల రైలు మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి రాత్రి 10.25 గంటలకు కడపకు, మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07136 గల రైలు ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 11.50 గంటలకు కడపకు, రాత్రి 11 గంటల 45 నిమిషాలకు హైదరాబాద్​కు చేరుకుంటుంది.

నాందేడ్‌ నుంచి మరో రైలు : నాందేడ్​ నుంచి 07139 నంబర్​ రైలు ఈ నెల 16న ఉదయం 8.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడపకు, రాత్రి 10 గంటల 30 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 18న మరో రైలు (07140) తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, మరోసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలును సికింద్రాబాద్​ వరకు మాత్రమే వేశారు.

హైదరాబాద్‌లోని మౌలాలీలో ఈ నెల 23, 30న 07141 నంబరు గల రైలు మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి తర్వాత రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడప, రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్​ 2వ తేదీల్లో 07142 నంబర్​ గల రైలు కొల్లాంలో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి, అదే రోజు రాత్రి 11 గంటలకు కడపకు, తర్వాతరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మౌలాలీకి చేరుకుంటుంది.

శబరిమలకు మరో 8 ప్రత్యేక రైళ్లు : 8 ప్రత్యేక రైళ్లను శబరిమలకు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి నుంచి కొల్లాంకు రైలు బయల్దేరగా ఈ నెల 24, డిసెంబర్​ 1న కొల్లాం - మౌలాలికి తిరుగు ప్రయాణం ఉంటుంది. ఈ నెల 18, 25వ తేదీల్లోనూ మచిలీపట్నం - కొల్లాంకు రైలు వెళ్లనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కొల్లాం - మచిలీపట్నం తిరుగు ప్రయాణానికి ఈ నెల 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నపడనున్నట్లు వెల్లడించింది.

అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?

Last Updated : Nov 15, 2024, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.