హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా వైద్యం అందిస్తున్న వారికోసం శాంపిల్ కలెక్షన్ కోసం నూతనంగా కియోస్క్ అందుబాటులోకి వచ్చింది. ఆస్పత్రి వైరాలజీ విభాగంలో పాథాలజీ విభాగానికి చెందిన వైద్యురాలు డాక్టర్ పద్మామాలిని ఈ కియోస్క్‌ను ఆస్పత్రికి డొనేట్ చేశారు. రాష్ట్రంలో రోగుల సంఖ్య పెరుగుతుంది. ఫలితంగా వైద్యులకు పీపీఈ కిట్స్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో శాంపిల్స్ కలెక్షన్ కోసం ఈ కియోస్క్‌లు ఎంతగానో ఉపయోగపడతాయని వైద్యులు చెబుతున్నారు.
కరోనా అనుమానితుల నుంచి శాంపిళ్లు సేకరించే వైద్యులు ఈ కియోస్క్లోనే ఉండి బయట ఉన్న రోగుల శాంపిళ్లను సేకరిస్తారు. ఫలితంగా పీపీఈకిట్స్ వినియోగం తగ్గుతుంది. మరోవైపు కియోస్క్ లోపల హెప్పా ఫిల్టర్లు అమర్చారు. కియోస్క్ లోపల గాలి ఎప్పటికప్పుడు పరిశుద్ధమౌతుంది. శాంపిళ్లు సేకరించే సమయంలో వైరస్ వ్యాప్తి జరగకుండా ఈ కియోస్క్ ఉపయోగపడుతుందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి : పోలీసులకు హారతులు..పూలవర్షం