సంప్రదాయ, వెస్ట్రన్ వస్త్రాలతో ర్యాంప్‌పై వయ్యారంగా నడుస్తూ... ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశారు చిన్నారులు. సిమాఫ్ గ్లోబల్ సంస్థ హైదరాబాద్‌లో ఫ్యాషన్ వీక్ నిర్వహించింది. డిసెంబర్‌లో జరిగే నేషనల్ కిడ్స్ ఫ్యాషన్ పోటీలకు మొదటి ఆడిషన్స్ నగరంలో ఉత్సాహంగా జరిగాయి. ర్యాంపుపై రంగు రంగుల దుస్తుల్లో చిన్నారులు మెరిసిపోయారు.
కార్యక్రమంలో మిస్ ఇండియా, ఆసియా ఫసిఫిక్ సుధాజైన్, మిస్ ఫ్యాషన్ ఐకాన్ హైదరాబాద్ అంకితా పటేల్, సిమాఫ్ గ్లోబల్ సంస్థ సీఈఓ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ అందాల పోటీలకు ప్రధాన నగరాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చూడండి : పీవీ సింధుకు కేసీఆర్ అభినందనలు